సీమాపురి నియోజకవర్గం | Seemapuri Seemapuri Constituency Aam Aadmi Party chances of victory | Sakshi
Sakshi News home page

సీమాపురి నియోజకవర్గం

Nov 23 2013 11:28 PM | Updated on Apr 4 2018 7:42 PM

అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రజల్లోకి వచ్చిన కేజ్రీవాల్ గతంలో సీమాపురిలో చేపట్టిన నిరాహార దీక్ష ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎన్నికల సమీకరణాలనే మార్చేసింది.

సాక్షి, న్యూఢిల్లీ: అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రజల్లోకి వచ్చిన కేజ్రీవాల్ గతంలో సీమాపురిలో చేపట్టిన నిరాహార దీక్ష ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎన్నికల సమీకరణాలనే మార్చేసింది. కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే ఈ నియోజకవర్గంలో బీజేపీ కూడా గట్టి పోటీనిచ్చే స్థాయిలోనే ఉండేది. ఈ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని భావించినప్పటికీ కేజ్రీవాల్ దీక్ష తర్వాత ఇక్కడ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు సీమాపురిలో లక్షన్నర మంది ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవ ర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలుపు అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపుఓటములను జాటవ్, ముస్లిం ఓటర్లు నిర్ణయిస్తారు. అధిక విద్యుత్తు చార్జీలకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ ఈ నియోజకవర్గంలోనే నిరాహారదీక్ష నిర్వహించారు. 
 
 దాంతో ఈ నియోజకవర్గం వాసుల్లో పలువురు ఆయనకు  మద్దతుదారులయ్యారు. తన ఉపవాసదీక్షకు మద్దతు ఇచ్చిన ఆర్టీఐ కార్యకర్త సంతోష్ కోలీని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా మొదట ప్రకటించారు. కానీ ఆమె రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మరణించడంతో ధర్మేంద్ర సింగ్ కోలీకి ఆప్ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్.. సిట్టింగ్ ఎమ్మెల్యే వీర్‌సింగ్ ధింగానాకే టికెట్ ఇచ్చింది. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధింగానా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన అభివృద్ధి పనులేమీ చేయలేదని బీజేపీ అభ్యర్థి రామ్‌పాల్ సింగ్, బీస్పీ అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ సంతోష్‌కుమార్ జాటవ్ ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement