breaking news
Seemapuri Constituency
-
Delhi: భవనం కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు, గర్భిణి మృతి!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని న్యూ సీమాపురిలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు, నాలుగు నెలల గర్భిణి సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద 11 మంది చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఘటనాస్థలంలో పలు శరీర భాగాలు లభించడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.న్యూ సీమాపురిలోని ఇరుకైన వీధుల్లో భవనం కూలిపోవడంతో స్థానికులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సమీపంలోని ఈద్గా వైపు నుంచి మాత్రమే ఘటనాస్థలానికి చేరుకునే అవకాశం ఉండటంతో అగ్నిమాపక సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి 7.20 గంటల సమయంలో ఓ చిన్నారి మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశారు. రాత్రి 8.15 గంటలకు నాలుగు నెలల గర్భిణి గులాఫ్సా మృతదేహాన్ని వెలికితీశారు. ఆమె వయసు 21 ఏళ్లు.ప్రమాదం జరిగిన సమయంలో గులాఫ్సా తన తల్లి ఇంటికి వెళ్లినట్లు ఆమె సోదరి సమీనా తెలిపారు. ఆమెతో పాటు నాలుగేళ్ల కుమార్తె, భవనం యజమాని కుమార్తె కూడా చిక్కుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనతో ఎదురుచూశారు. డీసీపీ (షహదారా) రాజేంద్ర ప్రసాద్ మీనా ఇప్పటివరకు ముగ్గురి మరణాన్ని ధ్రువీకరించారు. అయితే లభించిన శరీర భాగాలు మరికొందరు బాధితులకు చెందినవై ఉండొచ్చని తెలిపారు.మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) తెలిపిన వివరాల ప్రకారం.. కూలిన భవనం 20 నుంచి 25 ఏళ్ల నాటిది. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు పరిధిలోని జేజే క్లస్టర్లో ఇది ఉంది. భవనం యజమాని మహమ్మద్ అన్వర్ మేస్త్రీగా పనిచేస్తూ, గ్రౌండ్‌ఫ్లోర్‌లో స్క్రాప్ వ్యాపారం నిర్వహించేవాడు. అతను తన కుటుంబంతో కలిసి పై రెండు అంతస్తుల్లో ఉండేవాడు. మిగిలిన రెండు అంతస్తులను రెండు కుటుంబాలకు అద్దెకు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: దసరా: ఈ ఏడు ప్రాంతాల్లోనే అసలైన సందడి! -
కుప్పకూలిన ఐదంతస్థుల భవనం..
-
సీమాపురి నియోజకవర్గం
సాక్షి, న్యూఢిల్లీ: అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రజల్లోకి వచ్చిన కేజ్రీవాల్ గతంలో సీమాపురిలో చేపట్టిన నిరాహార దీక్ష ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎన్నికల సమీకరణాలనే మార్చేసింది. కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే ఈ నియోజకవర్గంలో బీజేపీ కూడా గట్టి పోటీనిచ్చే స్థాయిలోనే ఉండేది. ఈ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని భావించినప్పటికీ కేజ్రీవాల్ దీక్ష తర్వాత ఇక్కడ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు సీమాపురిలో లక్షన్నర మంది ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవ ర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలుపు అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపుఓటములను జాటవ్, ముస్లిం ఓటర్లు నిర్ణయిస్తారు. అధిక విద్యుత్తు చార్జీలకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ ఈ నియోజకవర్గంలోనే నిరాహారదీక్ష నిర్వహించారు. దాంతో ఈ నియోజకవర్గం వాసుల్లో పలువురు ఆయనకు మద్దతుదారులయ్యారు. తన ఉపవాసదీక్షకు మద్దతు ఇచ్చిన ఆర్టీఐ కార్యకర్త సంతోష్ కోలీని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా మొదట ప్రకటించారు. కానీ ఆమె రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మరణించడంతో ధర్మేంద్ర సింగ్ కోలీకి ఆప్ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్.. సిట్టింగ్ ఎమ్మెల్యే వీర్‌సింగ్ ధింగానాకే టికెట్ ఇచ్చింది. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధింగానా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన అభివృద్ధి పనులేమీ చేయలేదని బీజేపీ అభ్యర్థి రామ్‌పాల్ సింగ్, బీస్పీ అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ సంతోష్‌కుమార్ జాటవ్ ఆరోపిస్తున్నారు.


