ఖైదీలు చేసిన వస్తువుల విక్రయం | Sale goods made by prison | Sakshi
Sakshi News home page

ఖైదీలు చేసిన వస్తువుల విక్రయం

Jan 5 2014 1:53 AM | Updated on Sep 2 2017 2:17 AM

వేలూరు సెంట్రల్ జైలులోని ఖైదీలు తయారు చేసిన వస్తువుల విక్రయాన్ని శనివారం ఉదయం ప్రారంభించారు. సెంట్రల్ విశ్రాంతి

 వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు సెంట్రల్ జైలులోని ఖైదీలు తయారు చేసిన వస్తువుల విక్రయాన్ని శనివారం ఉదయం ప్రారంభించారు. సెంట్రల్ విశ్రాంతి భవనంలో ఉంచిన ఈ స్టాల్స్‌ను కార్మిక సంక్షేమ న్యాయమూర్తి మంజు ల ప్రారంభించారు. అనంతరం జైలు ఆవరణలో ఖైదీల బంధువుల కోసం విశ్రాంతి గదిలో ఫ్రీడమ్ అమ్మ క్యాంటీన్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాలాన్ని వృథా చేయకుండా జైలులోపల లెదర్ చెప్పులు, షూలు, కీచైన్, బెల్టు వంటివి తయారు చేయడం అభినందనీయమన్నారు. అలాగే జైలు ఆవరణలో ముళ్లంగి, ఉర్లగడ్డలను పండించి స్టాల్స్‌లో ఉంచారన్నారు. ఖైదీల కోసం ఈ నెల 8వ తేదీన బార్బర్ షాప్, పురుషుల బ్యూటీ పార్లర్ ను ప్రారంభించనున్నారని తెలిపారు. 
 
 ఖైదీలు తయారు చేసిన వస్తువులను ప్రజలకు తక్కువ ధరకు విక్రయించేందుకు జైలు అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. మదురైలో మహిళల కోసం ప్రత్యేక జైలును ఏర్పాటు చేస్తున్నారని ఇందుకోసం అక్కడ అవసరమైన ఫర్నీచర్ పూర్తిగా ఖైదీలు తయారు చేసి ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన క్యాంటీన్లు ఉదయం 8 నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఉంటుందన్నారు.  ఖైదీల బంధువులకు అవసరమైన ఆహారం, తిను బండారాలను ఈ క్యాంటీన్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. అనంతరం ఖైదీలు తయారు చేసి స్టాల్స్‌లో ఉంచిన వస్తువులను ఆమె పరిశీలించారు. జైలు సూపరింటెండెంట్ కరుప్పన్, అడిషనల్ సూపరింటెండెంట్ క్రిష్ణకుమార్, మహిళా జైలు సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, జైలు అధికారులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement