ఎయిర్పోర్ట్లో రూ. 2 కోట్ల బంగారం పట్టివేత | Rs. 2 crore worth gold seized in chennai airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో రూ. 2 కోట్ల బంగారం పట్టివేత

Dec 9 2014 9:08 AM | Updated on May 29 2019 3:19 PM

ఎయిర్పోర్ట్లో రూ. 2 కోట్ల బంగారం పట్టివేత - Sakshi

ఎయిర్పోర్ట్లో రూ. 2 కోట్ల బంగారం పట్టివేత

సింగపూర్ నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికుడి రియాద్ అహ్మద్ నుంచి 6.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

చెన్నై: సింగపూర్ నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికుడి రియాద్ అహ్మద్ నుంచి 6.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం రియాజ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో చెన్నై ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అదికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రియాజ్ లగేజీలో 6.5 కేజీల బంగారం ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న బంగారం విలువ మార్కెట్లో రూ. 2 కోట్ల ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement