అరుదైన సర్పం

Rare Trinket Snake Spotted In Jayapuram Forest - Sakshi

జయపురం : జయపురం పట్టణానికి స్నేక్‌ పారడైజ్‌ అని పేరు ఉంది. ఈ ప్రాంత ప్రజలంతా జయపురాన్ని పాముల స్వర్గం అంటారు. ఈ ప్రాంతంలో అనేక రకాల పాములు సంచరించడమే ఇందుకు కారణం. జయపురం వన్యప్రాణి పరిరక్షణ కమిటీ జయపురం పరిసర ప్రాంతాలలో అనేక రకాల పాములను పట్టుకుంటూ వాటిని సమీప అడవులలో విడిచిపెడుతోంది. ముఖ్యంగా వన్యప్రాణి çపరిరæక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తున్న కృష్ణ కేశవ షడంగి  జయపురంలోను, గ్రామీణ ప్రాంతాలలో, ఇళ్లలోను కనిపించే పాములను సునాయాసంగా బంధించి  వాటిని అడవిలో విడిచిపెడుతుంటారు.

ఏప్రాంతంలో పాము కనిపించినా ఆయనకు ఫోన్‌ చేస్తే వెంటనే వచ్చి పట్టుకుని సురక్షిత ప్రాంతాలలో విడిచి పెడతారు. గురువారం ఆయన జిల్లా కోర్టు ఆవరణలో సంచరిస్తున్న అపూర్వమైన పామును పట్టుకున్నారు. ఆ పామును పట్టుకున్న షడంగి అటువంటి పాములు కేవలం ఒడిశాలోనే కనిపిస్తాయని వెల్లడించారు. దానిని ట్రింకెట్‌ స్నేక్‌ అని అంటారని చెప్పారు.  ఒడిశాలో  దీనిని కౌడియ చిట్టి అని పిలుస్తారన్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top