‘రజనీ పొలిటికల్‌ ఎంట్రీ గురించి నాకు తెలియదు’ | Rajini kanth welcome in politics, says Panneerselvam | Sakshi
Sakshi News home page

‘రజనీ పొలిటికల్‌ ఎంట్రీ గురించి నాకు తెలియదు’

Jun 23 2017 5:37 PM | Updated on Sep 5 2017 2:18 PM

‘రజనీ పొలిటికల్‌ ఎంట్రీ గురించి నాకు తెలియదు’

‘రజనీ పొలిటికల్‌ ఎంట్రీ గురించి నాకు తెలియదు’

దక్షిణాది సూపర్ట్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం స్పందించారు.

న్యూఢిల్లీ : దక్షిణాది సూపర్ట్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం స్పందించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ గురించి తనకు తెలియదని, అయితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని అన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తామని, ఆయన మంచి వ్యక్తి అని ప‌న్నీర్ సెల్వం అన్నారు. బీజేపీ ఆహ్వానిస్తేనే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యానని ఆయన తెలిపారు. 
 
మరోవైపు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారని, కొత్త పార్టీ పెడతారంటూ ఆయన సన్నిహితులు, బంధువులు ఫీలర్లు వదులుతున్నారు. రజనీ జన్మదినమైన డిసెంబర్‌ 12వ తేదీన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement