ప్రభుత్వ బస్సు, లారీ ఢీ : ఆరుగురి మృతి | Public bus, lorry collided: six killed | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బస్సు, లారీ ఢీ : ఆరుగురి మృతి

Oct 17 2013 4:16 AM | Updated on Aug 30 2018 3:56 PM

పళ్లిపట్టు, న్యూస్‌లైన్ : కాంచీపురం సమీపంలో ప్రభుత్వ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో మహిళ సహా ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

 పళ్లిపట్టు, న్యూస్‌లైన్ : కాంచీపురం సమీపంలో ప్రభుత్వ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో మహిళ సహా ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై కోయంబేడు నుంచి తిరుపత్తూరుకు ప్రభుత్వ బస్సు బుధవారం వేకువ జామున బయలుదేరింది. సంతవేలూరు సమీపంలో లారీ డ్రైవర్ ప్రభుత్వ బస్సును అధిగమించేందుకు ప్రయత్నించాడు. 
 
 ఈ క్రమంలో ముందు వెళుతున్న బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ సహా ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్ అన్బు, పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను చేపట్టి కాంచీపురం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో  చెన్నై తిరుముల్లైవాయిల్‌కు చెందిన శివశంకర్, చెన్నై తేనాంపేటకు చెందిన గోమతి, వాలాజా పెరియ కడంబూర్‌కు చెందిన సతీష్, తిరువళ్లూర్‌కు చెందిన శింగారవేల్, కాట్టుపాక్కం అరుణాచలం వాణియంబాడికి చెందిన రాజవేలుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో బస్సు డ్రైవర్ అన్బు, కృష్ణగిరికి చెందిన కవిత, తెప్పాచ్చి, చెన్నైకు చెందిన జయలక్ష్మి, మురుగయ్యన్ తదితరులు ఉన్నారు.  వీరిని మంత్రి చిన్నయ్య, ఎమ్మెల్యేలు గణేశన్, పెరుమాళ్ పరామర్శించారు. షోళింగనల్లూర్ పోలీ సులు కేసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్ రామమూర్తిని అరెస్ట్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement