ఐస్‌క్రీం పార్లర్లలో వ్యభిచారం | prostitution in Ice-cream parlors | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీం పార్లర్లలో వ్యభిచారం

Aug 7 2016 11:38 AM | Updated on Sep 4 2017 8:17 AM

ఐస్‌క్రీం పార్లర్లలో వ్యభిచారం

ఐస్‌క్రీం పార్లర్లలో వ్యభిచారం

ఐస్‌క్రీం పార్లర్లలో రహస్యంగా నిర్వహిస్తోన్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.

చెన్నై: ఐస్‌క్రీం పార్లర్లలో రహస్యంగా నిర్వహిస్తోన్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాగర్‌కోవిల్ సహా కన్యాకుమారి జిల్లాలో అనేక ఐస్‌క్రీం పార్లర్‌లు వున్నాయి. వీటిల్లో కొన్ని ప్రత్యేక గదుల్లో యువ జంటల రాసలీలలకు వీలు కల్పిస్తున్నారు. ఈ ఘటనలపై అనేకమార్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.  వీటికి ముఖ్యంగా పాఠశాల, కళాశాలలకు చెందిన యువత  వస్తున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా ఐస్‌క్రీం పార్లర్లపై పోలీసులు దాడులు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఒక ఐస్‌క్రీం పార్లర్‌పై దాడి జరిపిన ఘటనలో ఒక యువజంట పోలీసులకు చిక్కింది. అనంతరం పార్లర్ యజమానిని పోలీసులు విచారణ జరిపారు. కాగా అరెస్టయిన వ్యక్తిని అన్నాడీఎంకేలోని ఒక నేత సిఫార్సుతో పోలీసులు వదిలిపెట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement