
మోదీ కోసం తాను ఓటు వేసి తీరాలని పట్టుబటిన ఓ నిండు గర్భిణి ఓటు వేసిన కొద్ది నిముషాల్లోనే డెలివరి అయిన ఘటన మంగళూరులోని ఉర్లాండిలో జరిగింది.
కర్ణాటక, బొమ్మనహళ్లి : మోదీ కోసం తాను ఓటు వేసి తీరాలని పట్టుబటిన ఓ నిండు గర్భిణి ఓటు వేసిన కొద్ది నిముషాల్లోనే డెలివరి అయిన ఘటన మంగళూరులోని ఉర్లాండిలో జరిగింది. గురువారం ఉదయం భర్త యోగానంద్‌తో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన మీనాక్షి ఓటు వేసి వెళ్లిన కొద్ది సేపటికే పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే పండంటి పాపకు మీనాక్షి జన్మనిచ్చింది.