ఎస్‌ఐ భార్య కోసం పోలీసుల గాలింపు | police searching for Tamil selvi | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ భార్య కోసం పోలీసుల గాలింపు

Mar 17 2016 8:37 AM | Updated on Aug 21 2018 7:34 PM

చీటీల కేసులో మోసానికి పాల్పడిన ఎస్‌ఐ భార్య కోసం పోలీసులు తమ గాలింపును ముమ్మరం చేశారు.

తిరువొత్తియూరు: చీటీల కేసులో మోసానికి పాల్పడిన ఎస్‌ఐ భార్య కోసం పోలీసులు తమ గాలింపును ముమ్మరం చేశారు. కాంచిరంగలైకు చెందిన రాము తిరుకోస్టియూర్‌లో ప్రత్యేక ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఇతని భార్య తమిళ్ సెల్వి. ఆమె చీటి వ్యాపారం చేస్తుంది. ఆ క్రమంలో తమిళ సెల్వికి కూలి పనులు చేసుకుని సంపాదించుకనే సెంథామరై చీటి కట్టింది. ఆమె కాకుండా ఆ పరిసర ప్రాంతానికి చెందిన మహిళలంతా తమిళ సెల్వికి 2011 నుంచి చీటి డబ్బులు కట్టారు.

చీటి వేసిన వారికి తమిళ్ సెల్వి తిరిగి డబ్బులు చెల్లించలేదు. దాంతో  సెందామరై తనకు నగదు చెల్లించాలని కోరింది. దీంతో ఎస్ఐ రాము హత్యా చేస్తానంటూ ఆమెను బెదిరించాడు.  దీంతో ఆమె జిల్లా క్రైం విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు రూ.41 లక్షలు మోసం చేసిన తమిళ్ సెల్వి కోసం గాలిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement