ఎంఎన్సీ ఉద్యోగులు పోలీసు అధికారుల వేషంలో వెళ్లి ...

ఎంఎన్సీ ఉద్యోగులు పోలీసు అధికారుల వేషంలో వెళ్లి ...


పోలీసు అధికారుల వేషంలో దొంగతనం

నిందితులిద్దరూ ప్రముఖ కంపెనీ ఉద్యోగులు

12 గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు






బెంగళూరు : వారిద్దరూ మంచి స్నేహితులు. మంచి కంపెనీల్లో పని చేస్తూ... వేలాది రూపాయల జీతం అందుకుంటున్నారు. అయితే విలాసవంతమైన జీవనం కోసం పెడదారి పట్టారు. సీనియర్ పోలీసు అధికారుల వేషంలో జ్యువెలరీ దుకాణంలోకి వెళ్లి రూ. 40 వేల విలువైన బంగారు చైన్ చోరీ చేశారు.


కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 12 గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలు... దేవసంద్రకు చెందిన కిశోర్కుమార్ ఓ బహుళ జాతి సంస్థలో హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్నాడు.పాండవపుర తాలుకా బీరశెట్టిహళ్లికి చెందిన కవిత ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తుంది. స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ సారక్కి మెయిన్రోడ్డులో ఉన్న విమల్ జ్యువెలర్స్ షాపులోకి సోమవారం మధ్యాహ్నం సీనియర్ పోలీస్ అధికారుల వేషంలో వెళ్లారు. ఆభరణాలు కొనుగోలు చేసే నెపంతో



బంగారు చైన్ చూసి రూ. 40 వేల విలువ చేసే 16 గ్రాముల బంగారు చైన్ అపహరించి ఉడాయించారు. ఆ విషయాన్ని గమనించిన షాపు యజమాని జేపీ నగర పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించి... నిందితుల ఆనవాళ్లను గుర్తించారు. డీసీపీ లోకేశ్ కుమార్ నేతృత్వంలో ఏసీపీ కాంతరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు 12 గంటల పాటు గాలించి... ఇద్దరిని అరెస్ట్ చేశారు. బంగారు చైన్, నకిలీ పోలీస్ గుర్తింపు కార్డు, పోలీస్ అధికారి యూనిఫామ్లో ఉన్న వారి ఫొటోలు, సెల్ ఫోను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top