ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైకు వెళ్లి జయలలితకు నివాళులు అర్పించనున్నారు.
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైకు వెళ్లి జయలలితకు నివాళులు అర్పించనున్నారు. ఈ రోజు 9:30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి చెన్నై చేరుకుంటారు. రాజాజీ పబ్లిక్ హాల్‌లో ఉంచిన జయలలిత పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పిస్తారు. ఎఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు.. జయలలిత అంత్యక్రియల్లో పాల్గొంటారు.
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి జయలలిత మరణించిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం మెరీనా బీచ్‌లో గురువు ఎంజీఆర్ సమాధి పక్కన జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.