‘ఢిల్లీ మేయర్’ నేమ్ ప్లేట్‌తోనే ఉత్తర ఢిల్లీ మేయర్ కారు | North Delhi Mayor's car still carries 'Delhi Mayor' plates | Sakshi
Sakshi News home page

‘ఢిల్లీ మేయర్’ నేమ్ ప్లేట్‌తోనే ఉత్తర ఢిల్లీ మేయర్ కారు

May 21 2014 10:53 PM | Updated on Sep 2 2017 7:39 AM

ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విభజన జరిగి దాదాపు రెండేళ్లవుతున్నా మేయర్ల కార్లపై ఉన్న నంబర్ ప్లేట్లు ఇంకా మారలేదు.

న్యూఢిల్లీ: ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విభజన జరిగి దాదాపు రెండేళ్లవుతున్నా మేయర్ల కార్లపై ఉన్న నంబర్ ప్లేట్లు ఇంకా మారలేదు. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ యోగేంద్ర చందోలియా ఉపయోగిస్తున్న కారుపై ఇంకా ‘మహాపౌర్ ఢిల్లీ’(ఢిల్లీ మేయర్) ప్లేటు దర్శనమిస్తోంది. అయితే కారు ముందుభాగంలో ఎగురుతున్న జెండా మాత్రం ఉత్తర ఢిల్లీ మేయర్ అని తెలుపుతోంది. వెనుక ఉన్న నేమ్ ప్లేట్ మాత్రం ఇంకా మార్చలేదు. అధికారిక కార్యక్రమాలకు చందోలియా ఇదే కారును ఉపయోగిస్తుండడం, కారుపై ఢిల్లీ మేయర్ అని రాసి ఉండడంపై పలువురు చర్చించుకుంటున్నారు. బుధవారం సివిక్ సెంటర్‌కు చందోలియా ఇదే కారులో వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు నేమ్‌ప్లేట్‌ను ప్రత్యేకంగా ఫోకస్ చేసి చూపడంతో ఈ అంశం మరోసారి వార్తల్లోకెక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement