ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ముద్రగడ | mudragada padmanabham announce protest schedule | Sakshi
Sakshi News home page

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ముద్రగడ

Dec 2 2016 3:33 PM | Updated on Sep 4 2017 9:44 PM

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ముద్రగడ

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ముద్రగడ

కాపు రిజర్వేషన్ల సాధనకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాలుగు దశల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించారు.

కాకినాడ: కాపు రిజర్వేషన్ల సాధనకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాలుగు దశల్లో భవిష్యత్‌ పోరాట కార్యాచరణ ప్రకటించారు. డిసెంబర్‌ 18న నల్ల రిబ్బన్లు కట్టుకుని.. కంచం, గరిటతో నిరసన తెల్పుతామని చెప్పారు. 30న ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తామని, జనవరి 8న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 25న కాపు సత్యాగ్రహ యాత్ర చేపడతామని, దీనికి ఎటువంటి అనుమతి తీసుకోబోమని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన కాపు జేఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

నవంబర్‌ 16 నుంచి 21 వరకు ముద్రగడ ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు సత్యాగ్రహ పాదయాత్ర చేపట్టాలని భావించినా ప్రభుత్వం అనుమతించకపోవడంతో విరమించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement