ఆ హీరోను అరెస్టు చేయాలి- మంత్రి | minister shanmugam says Kamal Haasan should be arrested | Sakshi
Sakshi News home page

ఆ హీరోను అరెస్టు చేయాలి- మంత్రి

Jul 16 2017 5:53 PM | Updated on Aug 20 2018 4:30 PM

ఆ హీరోను అరెస్టు చేయాలి- మంత్రి - Sakshi

ఆ హీరోను అరెస్టు చేయాలి- మంత్రి

నటుడు కమల హాసన్‌ను వెంటనే అరెస్టు చేయాలని న్యాయశాఖ మంత్రి సి.వి. షణ్ముగం అన్నారు.

టీ. నగర్‌: నటుడు కమల హాసన్‌ను వెంటనే అరెస్టు చేయాలని న్యాయశాఖ మంత్రి సి.వి. షణ్ముగం అన్నారు. విల్లుపురంలో ఆగస్టు 9వ తేది ఎంజీఆర్‌ వందేళ్ల వేడుకలు జరగనున్నాయి. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాటి పళని స్వామి పాల్గొననున్నారు. దీని కోసం బైపాస్‌ రోడ్డులో గల జానకి పురం మైదానాన్ని చదును చేస్తున్నారు. ఈ పనులను ఆదివారం న్యాయశాఖ మంత్రి సి.వి. షణ్ముగం పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎంజీఆర్‌ వందేళ్ల వేడుకలు జిల్లాల వ్యాప్తంగా జరగనున్నాయని ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారన్నారు.

ఈ వేడుకలు విల్లుపురంలో జరగనున్నాయని ఆయన తెలిపారు. నటుడు కమల్ హాసన్‌ అన్ని శాఖలలోనూ అవినీతి పెరిగినట్లు చెప్పడంపై ఆయన మండిపడ్డారు. రాజకీయాల గురించి మాట్లాడేందుకు నటుడు కమల హాసన్‌కు అర్హత లేదన్నారు. ఆయనను వెంటనే అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేయాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement