తాళ్లపాక అన్నమయ్య 514 వర్థంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో గురువారం ఉదయం మెట్లోత్సవం ఘనంగా జరిగింది.
తిరుపతిలో ఘనంగా మెట్లోత్సవం
Mar 23 2017 10:58 AM | Updated on Sep 5 2017 6:54 AM
తిరుపతి: తాళ్లపాక అన్నమయ్య 514 వర్థంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో గురువారం ఉదయం మెట్లోత్సవం ఘనంగా జరిగింది. అలిపిరి పాదాల మండపం వద్ద గురువారం తెల్లవారుజామున టీటీడీ ప్రత్యేకాధికారి ముక్తేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పాదాల మండపంలో సామూహిక ప్రార్థనలు, భజనలు చేశారు. సుమారు 1000 మందికి పైగా భక్తులు భజనలు, కోలాటాలతో అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. వేలాది మంది భక్తులు హరినామ సంకీర్తనలు చేస్తూ కాలిబాట మార్గంలో తిరుమలకు చేరుకున్నారు.
Advertisement
Advertisement