breaking news
annamayya utsavalu
-
సింగపూర్లో అన్నమయ్య జయంతి ఉత్సవాలు
సింగపూర్ : తొలి తెలుగు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి వేడుకలు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక శారదా హాల్, రామకృష్ణ మిషన్లో ఘనంగా జరిగాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సింగపూర్ లో నివసిస్తున్న వందలాది ప్రవాస తెలుగువారు పాల్గొని, సామూహికంగా సంకీర్తనలను ఆలపించారు. అన్నమయ్య సంకీర్తనలకు సంబంధించి విశేష కృషిచేసిన 'పద్మశ్రీ' డా. శోభారాజు ముఖ్య అతిథిగా విచ్చేసి, అన్నమయ్య, ఆయన సంకీర్తనల గురించి ఉపన్యసించి, కొన్ని సంకీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా శోభారాజు మాట్లాడుతూ, ఈ విధంగా అన్నమయ్య జయంతి సింగపూర్ లో తొలిసారిగా జరగడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, తెలుగు సంస్కృతి ,సాంప్రదాయాల పై సింగపూర్ తెలుగు సమాజానికి ఉన్న భక్తి, శ్రద్ద ల వలనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రశంసించారు. ప్రత్యేక అతిథిగా రామకృష్ణ మిషన్ అధ్యక్షులు స్వామి విమోక్షానంద విచ్చేసి తమ సందేశాన్నందంచారు. కార్యక్రమానంతరం అన్నప్రసాద వితరణ చేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ వినోదభరితం, మనోరంజకమైన కార్యక్రమాలే కాకుండా, ఆ భగవంతుని మీద పూర్తి భక్తి శ్రద్ధలతో భక్తి ప్రధానమైన ఉగాది పూజ వంటి కార్యక్రమాలు చేశామని వివరించారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి, ఆ భగవన్నామస్మరణకి తన జీవితం అంకితం చేసి, తనదైన శైలిలో ఆ శ్రీనివాసుని సంకీర్తనలను రచించి ఆలపించిన మన తెలుగు కవి అన్నమయ్య జన్మదిన మహోత్సవం జరుపుకోవడం మన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినవారికి, వాయుద్య, గాత్రసహకారమందించిన ప్రతి ఒక్కరికీ ప్రాంతీయ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి కృతజ్ఞతలను తెలిపారు. ఈకార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమ్రించిన కార్యవర్గసభ్యులు ప్రదీప్, సుందర్, జ్యోతీశ్వర్, మల్లిక్, ప్రసాద్, దాతలకు కార్యదర్శి సత్య చిర్ల దన్యవాదాలు తెలిపారు. -
తిరుపతిలో ఘనంగా మెట్లోత్సవం
తిరుపతి: తాళ్లపాక అన్నమయ్య 514 వర్థంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో గురువారం ఉదయం మెట్లోత్సవం ఘనంగా జరిగింది. అలిపిరి పాదాల మండపం వద్ద గురువారం తెల్లవారుజామున టీటీడీ ప్రత్యేకాధికారి ముక్తేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పాదాల మండపంలో సామూహిక ప్రార్థనలు, భజనలు చేశారు. సుమారు 1000 మందికి పైగా భక్తులు భజనలు, కోలాటాలతో అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. వేలాది మంది భక్తులు హరినామ సంకీర్తనలు చేస్తూ కాలిబాట మార్గంలో తిరుమలకు చేరుకున్నారు.