సింగపూర్‌లో అన్నమయ్య జయంతి ఉత్సవాలు

Tallapaka Annamacharya Birth Anniversary held in Singapore - Sakshi

సింగపూర్ : తొలి తెలుగు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి వేడుకలు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక శారదా హాల్, రామకృష్ణ మిషన్‌లో ఘనంగా జరిగాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ  వేడుకల్లో సింగపూర్ లో నివసిస్తున్న వందలాది ప్రవాస తెలుగువారు పాల్గొని, సామూహికంగా సంకీర్తనలను ఆలపించారు. అన్నమయ్య సంకీర్తనలకు సంబంధించి
విశేష కృషిచేసిన 'పద్మశ్రీ' డా. శోభారాజు ముఖ్య అతిథిగా విచ్చేసి, అన్నమయ్య, ఆయన సంకీర్తనల గురించి ఉపన్యసించి, కొన్ని సంకీర్తనలను ఆలపించారు. 

ఈ సందర్భంగా శోభారాజు మాట్లాడుతూ, ఈ విధంగా అన్నమయ్య జయంతి సింగపూర్ లో తొలిసారిగా జరగడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, తెలుగు సంస్కృతి ,సాంప్రదాయాల పై సింగపూర్ తెలుగు సమాజానికి ఉన్న భక్తి, శ్రద్ద ల వలనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రశంసించారు. ప్రత్యేక అతిథిగా రామకృష్ణ మిషన్ అధ్యక్షులు స్వామి విమోక్షానంద విచ్చేసి తమ సందేశాన్నందంచారు. కార్యక్రమానంతరం అన్నప్రసాద వితరణ చేశారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ వినోదభరితం, మనోరంజకమైన కార్యక్రమాలే కాకుండా, ఆ భగవంతుని మీద పూర్తి భక్తి శ్రద్ధలతో భక్తి ప్రధానమైన ఉగాది పూజ వంటి కార్యక్రమాలు చేశామని వివరించారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి, ఆ భగవన్నామస్మరణకి తన జీవితం అంకితం చేసి, తనదైన శైలిలో ఆ శ్రీనివాసుని సంకీర్తనలను రచించి ఆలపించిన మన తెలుగు కవి అన్నమయ్య జన్మదిన మహోత్సవం జరుపుకోవడం మన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినవారికి, వాయుద్య, గాత్రసహకారమందించిన ప్రతి ఒక్కరికీ ప్రాంతీయ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి కృతజ్ఞతలను తెలిపారు. ఈకార్యక్రమం విజయవంతం​ కావడానికి శ్రమ్రించిన కార్యవర్గసభ్యులు ప్రదీప్, సుందర్, జ్యోతీశ్వర్, మల్లిక్, ప్రసాద్, దాతలకు కార్యదర్శి సత్య చిర్ల దన్యవాదాలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top