
వేగం పెంచిన మణి
దర్శకుడు మణిరత్నం చిత్రాలంటేనే కనీసం ఏడాదిన్నర, రెండేళ్లు నిర్మాణం జరుపుకుంటాయనే టాక్ ఉంది.
దర్శకుడు మణిరత్నం చిత్రాలంటేనే కనీసం ఏడాదిన్నర, రెండేళ్లు నిర్మాణం జరుపుకుంటాయనే టాక్ ఉంది. విక్రమ్ హీరోగా నటించిన రావణన్ గానీ, ఆ తర్వాత తెరకెక్కించిన కడల్ చిత్రంగానీ నిర్మాణానికి చాలా రోజుల పట్టింది. అలాంటిది ఈ ప్రఖ్యాత దర్శకుడు వేగం పెంచారు. తాజా చిత్రం ఒకే కన్ముణి చిత్ర నిర్మాణాన్ని చాలా సెలైంట్‌గా ఫాస్ట్‌గా నిర్మాణం కావించడం విశేషం. ఇంకో విషయం ఏమిటంటే ఒకే కన్ముణి చిత్ర షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది, ఎక్కడ చిత్రీకరణ జరుపుకుటోందన్న విషయాల్ని చాలా గోప్యం ఉంచారు. మలయాళ సూపర్‌స్టార్ ముమ్మట్టి కొడుకు, దుల్కల్ సల్మాన్ హీరోగాను నటి నిత్యామీనన్ హీరోయిన్‌గాను నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందన్నది తాజా సమాచారం.
నిర్మాణానంతర కార్యక్రమాలు కూడ మొదలయ్యాయట. ఏక బిగువన ఒకే కన్ముణి చిత్ర షూటింగ్‌ను పూర్తి చేస్తున్నట్లు తెలిసింది. ఫీల్ గుడ్ రొమాంటిక్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఇంతకుముందు మణిరత్నం తెరకెక్కించిన అలప్పాయుదే చిత్రం తరహాలో ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో ఫైవ్‌స్టార్ చిత్రం ఫేమ్ కనిహ కీలక పాత్ర పోషిస్తున్నారట. ఈమెకు సంబంధించిన సన్నివేశాలను ప్యారిస్ కార్నర్ ప్రాంతంలో ఐదు రోజుల పాటు చిత్రీకరించారు. ఇది పట్టణ ప్రాంత ప్రేమ కథ చిత్రం అని తెలిసింది. ఇదే నేపథ్యంలో రూపొందిన అలప్పాయుదే చిత్రం మంచి విజయాన్ని సాధించింది. మరి ఈ ఒకే కన్ముణి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.