breaking news
malayalam superstar mammootty
-
75 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా మమ్ముట్టి..!ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం..
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అశేష అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు. ఆయన ఏడుపదుల వయసులోనూ యువ హీరోలకు తీసిపోని గ్లామరస్తో మంచి దృఢంగా ఉంటారు. అంతలా యంగ్‌గా హెల్దీగా ఉండటం కోసం మమ్ముట్టి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి ఆహార నియమాలను పాటిస్తారు వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా.!.మమ్ముట్టి ఫిట్నెస్ ఇప్పటికీ అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంటుంది. కండరబలం, చురుకుదనం, ఆరోగ్యకరమైన శరీరం సౌష్టవం తదితరాలను మెయింటైన్ చేస్తూ యంగ్ లుక్‌లో కనిపిస్తుంటారు. ఆయన క్రమశిక్షణయుతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందినవారు. తమిళ హీరో సూర్య సైతం ఆహారం విషయంలో మమ్ముట్టి నాకు స్పూర్తి అని చెబుతుంటారు. ఆయన ఇచ్చిన సలహాను ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఎప్పుడూ నీకు నచ్చింది తినమనే చెబుతుంటారని..కానీ నచ్చినంతగా కాకుండా మితంగా తీసుకోమని సూచిస్తుంటారు. అది ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడుతుందని ఆయన చెబుతుంటారని సూర్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు. అందులో నిజమెంత అంటే..ఇష్టమైన ఆహారంపై నియంత్రణ ముఖ్యంమమ్ముట్టి చెబుతున్నట్లుగా నచ్చిన ఫుడ్ హాయిగా తినాలి, కానీ తీసుకునే పరిమాణంపై నియంత్రణ మస్ట్ అనేది సరైదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎంత తింటున్నారో అనేదానిపై నియంత్రణ మనకు సరైన కేలరీల మోతాదు తీసుకునేందుకు హెల్ప్ అవుతుందట. ఇక్కడ కేవలం తక్కువ తినడం మాత్రమే కాదు ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్లు, ఖనిజాలు ఉండే పోషకవంతమైన ఆహార తీసుకోవడం అత్యంత కీలకం అని చెబుతున్నారు నిపుణుల. ఆరోగ్యకరంగా ఉండేలా..అలాగే మమ్ముట్టి వేయించిన ఆహారాలు, చక్కెర పదార్థాలు, అధిక నూనెకు దూరంగా ఉంటూ..ఆరోగ్యకరమైన ఆహార పద్ధతినే పాటిస్తారట. ఈ ఆహారాలను తగ్గించడం వల్ల కేలరీలు పరిమితంగా ఉంటాయి. అలాగే కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలు, నట్స్, గుడ్లు, చేపలు వంటి ప్రోటీన్ వనరులు అధికంగా ఉండేవి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఫుడ్ప్లాన్..ఏదీ తీసుకున్న నియంత్రిత పరిమాణంలో తీసుకునేలా ప్రాధాన్యత ఇస్తారట. అల్పాహారంలో ఓట్స్ గంజి, గుడ్డులో తెల్లసొన, బొప్పాయి, నానబెట్టిన బాదం పప్పులు ఉంటాయట. మధ్యాహ్న భోజనానికి తక్కువ మసాలాలతో తయారు చేసిన చేపల కూరను అన్నానికి బదులుగా ఓట్స్ పుట్టుతో కలిపి తీసుకుంటానని చెప్పారు. ఇక రాత్రి భోజనంగా గోధుమ లేదా ఓట్స్ దోసెల తోపాటు చికెన్ లేదా చేపల కూర తీసుకుంటానని చెప్పారు. భోజనం చివర్లో మష్రూమ్ సూప్ తీసుకుంటారట. ఇలా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను మిళితం చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు, అలాగే బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.వ్యాయామం, తగిన విశ్రాంతి..అలాగే క్రమంతప్పకుండా వర్కౌట్లు చేస్తుంటారు. వయసు పెరిగే కొద్ది రెసిస్టెన్స్ వ్యాయామం ప్రత్యేకంగా చేయాలని చెబుతున్నారు వైద్యులు. ఎందుకుంటే కండరాలు క్షీణించే అవకాశం ఉంటుంది కాబట్టి..కార్డియో వ్యాయామాలు వంటివి చేయాలని చెబుతున్నారు. ఇక నిద్రపై కూడా మంచి శ్రద్ధపెడతానని చెప్పారు. శారీరక ఒత్తిడి నుంచి కోలుకునేందుకు సరైన నిద్ర నాణ్యత ఉండాలని అంటున్నారు. రోజువారీ పనితీరుకు నిద్ర ఎంతో కీలకం అని అంటున్నారు నిపుణులు. ఈ విధంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని నిలకడగా పాటిస్తే..ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ఆస్వాదించగలగడమే కాకుండా ఎప్పటికీ యంగ్ లుక్‌లోనే చురుకుగా కనిపించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రూ. 90 లక్షల జీతం వదులుకుని ఇండోర్ వ్యవసాయం..! కట్‌చేస్తే ఏకంగా రూ. 1.44 కోట్లు..) -
వేగం పెంచిన మణి
దర్శకుడు మణిరత్నం చిత్రాలంటేనే కనీసం ఏడాదిన్నర, రెండేళ్లు నిర్మాణం జరుపుకుంటాయనే టాక్ ఉంది. విక్రమ్ హీరోగా నటించిన రావణన్ గానీ, ఆ తర్వాత తెరకెక్కించిన కడల్ చిత్రంగానీ నిర్మాణానికి చాలా రోజుల పట్టింది. అలాంటిది ఈ ప్రఖ్యాత దర్శకుడు వేగం పెంచారు. తాజా చిత్రం ఒకే కన్ముణి చిత్ర నిర్మాణాన్ని చాలా సెలైంట్‌గా ఫాస్ట్‌గా నిర్మాణం కావించడం విశేషం. ఇంకో విషయం ఏమిటంటే ఒకే కన్ముణి చిత్ర షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది, ఎక్కడ చిత్రీకరణ జరుపుకుటోందన్న విషయాల్ని చాలా గోప్యం ఉంచారు. మలయాళ సూపర్‌స్టార్ ముమ్మట్టి కొడుకు, దుల్కల్ సల్మాన్ హీరోగాను నటి నిత్యామీనన్ హీరోయిన్‌గాను నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందన్నది తాజా సమాచారం. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడ మొదలయ్యాయట. ఏక బిగువన ఒకే కన్ముణి చిత్ర షూటింగ్‌ను పూర్తి చేస్తున్నట్లు తెలిసింది. ఫీల్ గుడ్ రొమాంటిక్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఇంతకుముందు మణిరత్నం తెరకెక్కించిన అలప్పాయుదే చిత్రం తరహాలో ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో ఫైవ్‌స్టార్ చిత్రం ఫేమ్ కనిహ కీలక పాత్ర పోషిస్తున్నారట. ఈమెకు సంబంధించిన సన్నివేశాలను ప్యారిస్ కార్నర్ ప్రాంతంలో ఐదు రోజుల పాటు చిత్రీకరించారు. ఇది పట్టణ ప్రాంత ప్రేమ కథ చిత్రం అని తెలిసింది. ఇదే నేపథ్యంలో రూపొందిన అలప్పాయుదే చిత్రం మంచి విజయాన్ని సాధించింది. మరి ఈ ఒకే కన్ముణి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.


