మలెనాడును వణికిస్తున్న చలి | Malenadu the cold | Sakshi
Sakshi News home page

మలెనాడును వణికిస్తున్న చలి

Dec 1 2014 2:56 AM | Updated on Sep 2 2017 5:24 PM

మలెనాడును వణికిస్తున్న చలి

మలెనాడును వణికిస్తున్న చలి

మలెనాడులో చలిదెబ్బకు జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు

శివమొగ్గ: మలెనాడులో చలిదెబ్బకు జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వారం రోజు లుగా జిల్లాలో చలితీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణంగా మ లెనాడులో డిసెంబరు-జనవరి నెలలో చలితీవ్ర త అధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఒక నెల ముందే చలితీవ్రరూపం దాల్చింది. మరోవైపు అక్టోబరు ఆఖరు వరకు జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు పడ్డాయి. నవంబరు నెల మొదటి వారంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టినా చలి కనబడలేదు. అనంతరం క్రమేణా జిల్లాలో చలితీవ్రత పెరిగిపోయింది. శివమొగ్గ నగరంలో పగలు ఎండలు రాత్రి చలితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పగటి పూట నగరంలో 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

సాయంత్రం 5-6 గంటలు అయితే ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా పడిపోయి చలి తీవ్రత పెరిగిపోతుంది. అర్ధరాత్రి సమయంలో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 12 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది. చలి తీవ్రతతో ప్రజలు ఇంటి నుంచి ఉదయం 10 గంటలైన బయటకు రావాలంటేనే చలిభయంతో హడలిపోతున్నారు. శివమొగ్గ పరిస్థితే ఇతర తాలూకాల్లో నెలకొంది. అయితే హొసనగర, భద్రావతి, సాగర, సొరబ, శికారిపుర, తీర్థహళ్లి చలితీవ్రత అధికంగా ఉంది. హొసనగర, సాగర, తీర్ధహళ్లి తో పాటు పూర్తి మలెనాడు ప్రాంతంలో చలి హడలెత్తిస్తుంది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement