కర్ణాటక ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్యాయత్నానికి పా ల్పడింది.
మదనపల్లె రూరల్: మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్యాయత్నానికి పా ల్పడింది. ఈ సంఘటన మదనపల్లె మండలంలో ఆదివారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కర్ణాటక రాష్ర్ట్రం కోలార్‌కు చెందిన ఎస్. వెంకట మునియప్ప కుమార్తె కవిత(18), ఐదేళ్ల క్రితం రామసముద్రం మండలం దిగువపల్లె నుంచి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి వలస వెళ్లిన కె. మోహన్‌కుమార్ కుమారుడు వినయ్(20)లు కో లార్ మై ఐఐటీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరి నొకరు ప్రేమించుకుంటున్నారు. పదో తరగతిలో పరిచయమైన వీరి స్నేహం ప్రేమకు దారితీసింది.
కవితకు మైనారిటీ తీరడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం వారి వారి తల్లి తండ్రులతో పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. పెళ్లికి వారు ఒప్పుకోక పోవడంతో ఆ దివారం వేకువజామున పారిపోయి మదనపల్లెకు చేరుకున్నారు. నక్కల దిన్నె సమీపంలోని తోటలోకి చేరుకుని విషపుగుళికలు తిన్నారు. కడుపులో మంటలు ఎక్కువ కావడంతో కేకలుపెట్టారు. గుర్తించిన తోట య జమాని ఇద్దరినీ ఆటోలో తీసుకొచ్చి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రథమచికిత్స అందించిన వైద్యులు వినయ్ పరిస్థితి విషమంగా ఉందని తిరుపతికి రెఫర్‌చేశారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


