breaking news
Love couple commit suicide
-
‘ఆయనకు నాపై ప్రేమ తగ్గింది’.. సమత డైరీలో ఆవేదన
హైదరాబాద్: కేపీహెచ్‌బీ పరిధిలోని ఎంజీ నివాసంలో గత నెల 27న కుమార్తెను హత్య చేసిన అనంతరం దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో పోలీసులకు కీలక ఆధారం లభించింది. ఆత్మహత్యకు ముందు గోపీనాథ్, సమత ఇంటి గోడపై రాసిన లేఖలో తమ మరణాలకు ఇతరులెవరూ కారణం కాదని, ఎవరినీ విచారించవద్దని పేర్కొన్నారు.ఈ క్రమంలో కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్‌హెచ్‌వో విజయకుమార్.. పశ్చిమ బెంగాల్ నుంచి దంపతుల కుటుంబ సభ్యులను రప్పించి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో సమత రాసుకున్న డైరీ పోలీసులకు లభ్యమైంది. అది బెంగాలీ భాషలో ఉండటంతో కుటుంబ సభ్యులు చదివి హిందీలో పోలీసులకు వివరించారు.గోపీనాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమత.. తన భర్త గతంలో మాదిరిగా ప్రేమగా ఉండటం లేదని డైరీలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనపై ఆయనకు ప్రేమ తగ్గిపోయిందని, తనను పట్టించుకోవడం లేదని రాసుకున్నట్లు సమాచారం. తన వైపు నుంచి భర్తపై ప్రేమ ఉన్నప్పటికీ.. ఆయన నుంచి అదే స్థాయిలో ప్రేమ లభించడం లేదని, అనవసరంగా ఆయన జీవితంలోకి వచ్చానని వాపోయినట్లు వెల్లడైంది.ఈ పరిణామాల నేపథ్యంలో దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు కొనసాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ జీవితంలో ఎదురైన సమస్యలు, పరస్పర విభేదాల కారణంగా వారు తీవ్ర మానసిక వేదనకు గురై ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ‘అందరికీ థ్యాంక్యూ చెప్పండి’.. లేఖలో సమంత ప్రస్తావన -
కర్ణాటక ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్: మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్యాయత్నానికి పా ల్పడింది. ఈ సంఘటన మదనపల్లె మండలంలో ఆదివారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కర్ణాటక రాష్ర్ట్రం కోలార్‌కు చెందిన ఎస్. వెంకట మునియప్ప కుమార్తె కవిత(18), ఐదేళ్ల క్రితం రామసముద్రం మండలం దిగువపల్లె నుంచి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి వలస వెళ్లిన కె. మోహన్‌కుమార్ కుమారుడు వినయ్(20)లు కో లార్ మై ఐఐటీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరి నొకరు ప్రేమించుకుంటున్నారు. పదో తరగతిలో పరిచయమైన వీరి స్నేహం ప్రేమకు దారితీసింది. కవితకు మైనారిటీ తీరడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం వారి వారి తల్లి తండ్రులతో పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. పెళ్లికి వారు ఒప్పుకోక పోవడంతో ఆ దివారం వేకువజామున పారిపోయి మదనపల్లెకు చేరుకున్నారు. నక్కల దిన్నె సమీపంలోని తోటలోకి చేరుకుని విషపుగుళికలు తిన్నారు. కడుపులో మంటలు ఎక్కువ కావడంతో కేకలుపెట్టారు. గుర్తించిన తోట య జమాని ఇద్దరినీ ఆటోలో తీసుకొచ్చి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రథమచికిత్స అందించిన వైద్యులు వినయ్ పరిస్థితి విషమంగా ఉందని తిరుపతికి రెఫర్చేశారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


