కల్లు దుకాణాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

Lockdown Exemption: Kerala Government Green Signal Lo Toddy Shop - Sakshi

తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం పలు షరతులతో కూడిన లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో అనేక రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కానీ తొలి కేసు నమోదైన కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు మద్యం అమ్మకాలకు అక్కడి ప్రభుత్వం అనుమతినివ్వలేదు.  అయితే తాజాగా అక్కడి ప్రభుత్వం కూడా కొన్ని లాక్‌డౌన్‌ సడలింపులకు ఆమోదం తెలిపింది. 

దీనిలో భాగంగా కల్లు విక్రయాలకు కేరళ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కల్లు దుకాణాలు తెరవడానికి అనమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కల్లు దుకాణాల సంఖ్యపై ఎలాంటి పరిమితులు విధించలేదు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న అన్ని కల్లు దుకాణాలు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే దుకాణాల వద్ద భౌతిక దూరం, మాస్స్‌లు ధరించడం తప్పనిసరి అని తేల్చిచెప్పింది.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గీత కార్మికులు, మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఇప్పట్లో వైన్స్‌ షాప్స్‌కు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. 

చదవండి:
ఆంధ్రప్రదేశ్:‌ యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం
జూన్‌లో రైళ్ల కూత.. బస్సులపై అస్పష్టత

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top