
ప్రతీకాత్మక చిత్రం
చెన్నై : ఓ ఆలయంలో ప్రసాదం తిన్న 73 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన తమిళనాడులోని కడులూరు జిల్లాలోని శతమంగళం గ్రామంలోని అమ్మాన్ ఆలయంలో చోటు చేసుకుంది. వేడుకల్లో భాగంగా ఆలయంలో భక్తులకు సాంబారు అన్నం పెట్టారు. ఈ ప్రసాదం స్వీకరించిన భక్తులకు తలతిరగడంతో పాటు, వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే స్థానికులు సమీప విరుదాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో 14 మంది మహిళలు ఉండగా.. ఆరుగురు చిన్నారులున్నారు. ప్రసాదంలో తమకు చనిపోయిన బల్లి కనిపించిందని భక్తులు ఆరోపించారు. ఈ ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.