Lizard
-
ఆహారంలో బల్లి.. 50 మందికి అస్వస్థత
లాతూర్: మహారాష్ట్రలోని లాతూర్‌లో కలుషిత ఆహారం తిన్న విద్యార్థినులు అనారోగ్యం బారినపడ్డారు. ఇక్కడి పురన్మల్ లాహోటీ హాస్టల్లో కలుషిత ఆహారం తిన్న 50 మంది విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థినులను తిరిగి హాస్టల్‌కు పంపించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం వారు తిన్న ఆహారంలో బల్లి కనిపించింది. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆస్పత్రిలో వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. లాతూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శివాజీ కల్గే మీడియాతో మాట్లాడుతూ గార్మెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్నారు. వారికి చికిత్స అందించి, అబ్జర్వేషన్లో ఉంచి తరువాత తిరిగి హాస్టల్‌కు పంపించామన్నారు. కాగా ఈ ఘటనపై హాస్టల్ అధికారులు విచారణ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: 'మూడు రెట్ల జీతం వచ్చే ఉద్యోగం' -
మధ్యాహ్న భోజనంలో బల్లి.. వంద మంది విద్యార్థులకు అస్వస్థత
భువనేశ్వర్: ఒడిశాలో ఓ స్కూల్లో మధ్యాహ్నభోజనం తిన్న వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా బాలాసోర్‌లోని సిర్పూర్ గ్రామంలో ఉన్న ఉదయనారాయణ్ స్కూల్లో పిల్లలకు గురువారం(ఆగస్టు8) అన్నం, కూర వడ్డించారు. భోజనంలో బల్లి పడిన విషయాన్ని కొద్దిసేపటి తర్వాత పిల్లలు గుర్తించారు.దీంతో ఎవరూ భోజనాలు తినొద్దని స్కూల్ సిబ్బంది ఆదేశించారు. అయితే అప్పటికే కొందరు పిల్లలు భోజనం తినేయడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరికి కడుపునొప్పితో పాటు ఛాతినొప్పి సమస్యలు వచ్చాయి. వారందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. భోజనం విషతుల్యమవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని బ్లాక్ విద్యాధికారి తెలిపారు. -
ఆన్లైన్లో ఎయిర్ ప్రైయర్ బుక్ చేస్తే బల్లిని డెలివరీ చేశారేంటి!
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇన్నిరోజులు ఫుడ్ ఆర్డర్ పెడితే ఇటుక బిళ్లలు రావడం, ఫోన్ ఆర్డర్ పెడితే ధర్మకోల్ షీట్లు రావడం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అదే ఆన్లైన్లో ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెడితే బల్లులు ప్రత్యక్షమవుతున్నాయి.దక్షిణ అమెరికాకు చెందిన సోఫియా సెరానో అనే మహిళ ఎయిర్ ప్రైయర్ను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ రానే వచ్చింది. వెంటన్ ఎయిర్ ఫ్రైయర్ ఎలా ఉందోనని పరిశీలించేందుకు పార్శిల్ తెరిచి చూసింది. అంతే పార్శిల్ లోపల ఉన్న బల్లిని చూసి వణికిపోయింది. వెంటనే తనకు ఎదురైన చేదు అనుభవంపై స్పందించింది.అమెజాన్ పంపిన పార్శిల్ లోపల ఉన్న బల్లి ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను అమెజాన్‌లో ఎయిర్ ఫ్రైయర్ కోసం ఆర్డర్ పెట్టా. కానీ పార్శిల్లో బల్లి వచ్చింది. ఇది అమెజాన్ సంస్థ తప్పా లేదంటే కొరియర్ సంస్థది తప్పా అనేది తెలియదు’అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌పై అమెజాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. Pedimos una air fryer por Amazon y nos llegó con un acompañante 🙄 no sé si fue culpa de Amazon o la transportadora … buenos días! pic.twitter.com/BgYDi4qUev— Sofia Serrano (@sofiaserrano97) July 18, 2024కాగా, అమెజాన్ పంపిన పార్శిల్లో బల్లి ఉండడంపై పలువురు నెటిజన్లు పలు జాగ్రత్తలు చెబుతున్నారు. ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేసిన వస్తువు పార్శిల్ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేసే సమయంలో వీడియో తీయడం మంచిది. అలా వీడియో తీయడం వల్ల మీరు పెట్టిన ఆర్డర్ ఒకటైతే..మీకు వచ్చిన వస్తువు మరొకటి అయినప్పుడు.. సదరు ఈకామర్స్ సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు, తగిన నష్ట పరిహారం పొందేందుకు సులభతరం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. -
క్రికెట్ గ్రౌండ్లోకి ఉడుము.. అంతా ఒక్కసారిగా షాక్! వీడియో వైరల్
కొలంబో వేదికగా శ్రీలంక- అఫ్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ రెండో రోజు ఆటను వీక్షించడానికి అనుకోని అతిథి స్టేడియం వచ్చింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మైదానంలో ఉడుము ప్రత్యక్షమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 48 ఓవర్ వేసిన పేసర్ నిజత్ మసూద్ బౌలింగ్‌లో నాలుగో బంతిని ఎదుర్కోవడానికి దినేష్ చండిమాల్ సిద్ధమయ్యాడు. అయితే బౌండరీ రోప్ వద్ద ఒక్కసారిగా ఉడుము కన్పించింది. బిగ్ స్క్రీన్‌లో ఉడుమును చూసిన అంపైర్ ఆటను కాసేపు నిలిపివేశాడు. వెంటనే మైదాన సిబ్బంది దాన్ని అక్కడినుంచి బయటకి పంపించారు. దీంతో తిరిగి మళ్లీ ఆట ప్రారంభమైంది. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శ్రీలంక మైదానాల్లో సరృసృపాలు ప్రత్యక్షం కావడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది శ్రీలంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా వరుసగా రెండు మ్యాచ్‌లకు పాము హాజరై కలకలం రేపింది. చదవండి: #Angelo Mathews: ఏంటి అన్న నీకే ఎందుకు ఇలా? ఫోర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు! వీడియో వైరల్ -
ఖలునికి నిలువెల్లా విషము గదరా సుమతీ!
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత సోషల్ మీడియాలో పాపులర్. ఆమెకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. జంతుప్రేమికురాలైన అమృత పాము, ఒకరకం బల్లితో దిగిన ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు... ‘అత్యంత ప్రమాదకరమైన, విషతుల్యమైన జంతువు మనిషి మాత్రమే’ అనే కాప్షన్ ఇచ్చింది అమృత. ‘ఫోటోల కంటే మీ కాప్షన్ అద్భుతంగా ఉంది’ ‘సాటిజీవుల పట్ల మనకు ఉండాల్సిన ప్రేమను అందంగా అద్దం పట్టిన ఫొటోలు ఇవి’... అంటూ నెటిజనులు స్పందించారు. తన ట్విట్టర్ ప్రొఫైల్ బయోలో బ్యాంకర్, ప్లేబ్యాక్ సింగర్, సోషల్ వర్కర్ అని రాసుకుంది అమృత. -
జైలు భయంతో బల్లిని మింగేశాడు..!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ వ్యక్తి బల్లిని మింగేశాడు. కాన్పూర్ జిల్లాలోని మల్లవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అత్యాచార కేసులో అదుపులోకి తీసుకున్న మహేశ్ అనే నిందితున్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. నిందితున్ని రాత్రి సమయంలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ సమయంలోనే మహేశ్ నోట్లో బల్లి ఉండటం చూసి కంగుతిన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన వైద్యులు మహేశ్ కడుపులో నుంచి బల్లిని బయటకు తీశారు. ప్రాణాపాయం ఏం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే.. ఈ అత్యాచార కేసులో మహేశ్‌పై చేసిన ఫిర్యాదును బాధితురాలు వెనక్కి తీసుకున్నారు. బల్లిని ఎందుకు మింగావని మహేశ్‌ను పోలీసులు అడగగా.. జైలంటే చాలా భయమని తెలిపాడు. అందుకే బల్లని మింగి.. ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఇదీ చదవండి: హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..! -
వయాగ్రాపై బ్యాన్.. ఉడుం నూనె కోసం ఎగబడుతున్న యువత..!
ఇస్లామాబాద్: వయాగ్రా వినియోగంపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో కామోద్ధీపన కోసం ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు అక్కడి యువకులు. ఈక్రమంలో ఉడుం కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఉడుములు వేటాడే ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లో రావల్పిండి యువకులు ఈ ఉడుం నూనె కోసం పరితపిస్తున్నారు. ఎంత డబ్బైనా వెచ్చింది దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉడుం నుంచి తీసిన కొవ్వును తేలు నూనెలో మేరినేట్ చేసి ఎరుపు రంగు మసాలలలో ఉపయోగిస్తారు. లేదా దీనితో సాందా తైలాన్ని తయారు చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్తే లైంగిక వాంఛ, సామర్థ్యం పెరిగి పడకగదిలొ రెచ్చిపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రావల్పిండిలోని రాజా బాజార్లో ఉడుం నూనె కోసం యువకుల తాకిడి పెరిగింది. పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో చాలా ముంది ఉడుముల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీటికి డిమాండ్ పెరగడంతో వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉడుములను చంపడం తమకు బాధగా అన్పిస్తోందని, కానీ జీవనోపాధి కోసం తప్పడం లేదని వారు చెబుతున్నారు. దశాబ్దాలుగా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నామని పేర్కొన్నారు. పాకిస్తాన్లో ఎక్కుమంది పిల్లల్ని కంటేనే సమాజంలో ఆ దంపతులను గౌరవం ఉంటుంది. పిల్లలు లేకపోతే పరువు పోతుందని చాలా మంది లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయాగ్రా ఉపయోగించేవారు. ఇప్పుడు దానిపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఉడుం నూనెకు డిమాండ్ పెరిగింది. అయితే దీని వల్ల లైంగిక వాంఛ, సామర్థ్యం, పటుత్వం పెరుగుతుందని ఇప్పటివరకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఉడుం వేటగాళ్లు మాత్రం నిజంగానే దీనిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలున్నాయని చెబుతున్నారు. చదవండి: ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో.. -
వడ్డిస్తుండగా సాంబారులో బల్లి.. అప్పటికే తిన్న వారికి..
ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని మహిళల వసతి గృహం (నాగావళి)లో శనివారం రాత్రి భోజనాల సమయంలో సాంబారులో బల్లి కనిపించింది. రాత్రి 9.30 సమయంలో విద్యార్థినులు భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో ఒక విద్యార్థినికి సాంబారు వేస్తుండగా బల్లి కనిపించింది. దీంతో విద్యార్థి నులంతా భోజనాలు ఆపేశారు. అంతా కలిసి వసతి గృహం వద్ద వంట నిర్వహణ సిబ్బందికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అయితే అప్పటికే తిన్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. వర్సిటీ ఆరోగ్య సిబంది సైతం పర్యవేక్షించారు. నిరసనకు దిగిన విద్యార్థులతో వసతి గృహ నిర్వాహకులు చర్చలు జరిపారు. చివరకు మళ్లీ వంట చేసి రాత్రి 11.30 సమయంలో భోజనం పెట్టారు. విద్యార్థులు ఫోన్లో వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వంటకు వాడుతున్న నీటి నిర్వహణ, వంట గది పారిశుద్ధ్యం, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు చేశారు. గతంలోనూ ఇలాంటివి జరిగినా లోపాలపై దృష్టిపెట్టడం లేదని విద్యార్థులంటున్నారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ఏ రాజేంద్ర ప్రసాద్ వద్ద విషయం ప్రస్తావించగా దీనిపై విచారణ నిర్వహిస్తామన్నారు. చదవండి: ఇంజినీర్ చిన్నాలమ్మ!.. చదువు లేకపోయినా సంకల్ప బలంతో.. -
అరే నాయన ఏంట్రా బాబు ఇది? తినాలా? వద్దా!
ఇటీవల కాలంలో కొన్ని హోటల్లో సదరు కస్టమర్లకు ఎదురైన చేదు అనుభవాలను చూస్తే బయట ఫుడ్ తినాలంటేనే భయపడేలా చేశాయి. మొన్నటికి మొన్న ఒక ఆమె కూతురు కోసం దోశ ఆర్డర్ చేస్తే...ప్యాకింగ్ చేసిన పేపర్ పై పాము కుబుసం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరొకసారి సాంబార్ బొద్దింకల అవయవాలను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అవన్నీ ఒకత్తెయితే ఇక్కడొక కస్టమర్ ఆర్డర్ చేసిన టిఫిన్ ప్లేట్లో బతుకున్న బల్లిని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వివరాల్లోకెళ్తే...చండీగఢ్‌లో ప్రసిద్ధి చెందిన ఈలాంటే మాల్లోని సాగర్ రతన్ ఫుడ్ కోర్ట్‌లో గురిందర్ చీమా అనే కస్టమర్‌కి చేదు అనుభవం ఎదురైంది. చోలే భాతురే(పూరీ, శనగల కర్రీ) ఆర్డర్ చేశాడు. సదరు కస్టమర్ పూరీ తిందాం అనుకునేటప్పటికీ ప్లేట్లో బతికున్న బల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో సదరు కస్టమర్ ఫిర్యాదు మేరకు ఆరోగ్యశాఖాధికారులు రంగంలోకి దిగి ఆహార పదార్థాల నమునాను సేకరించి పరీక్షలకు పంపిచడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బీజేపీకి పార్టీకి చెందిన రవిరాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఫుడ్ కోర్ట్‌లో ఇది సర్వసాధారణం, బొద్దింకలు, చిన్న చిన్న సరీసృపాలు కూడా ఆహారాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాయంటూ వ్యగ్యంగా కామెంట్లు చేస్తూ...ట్వీట్ చేశారు. Had a very horrible experience on 14.6.22, at Sagar Ratan, food court, Elante Mall, Chandigarh. A live Lizard was found in semi-conscious state under the Bhatura. Complaint given to @DgpChdPolice they made sample seized by food health Dept. Chd. @KirronKherBJP@DoctorAjayita pic.twitter.com/ej4sLHrnH5 — Ravi Rai Rana #RWorld (@raviranabjp) June 15, 2022 (చదవండి: అట్టహాసంగా లగ్జరీ కారుల్లో డ్యాన్స్‌లు చేస్తూ... పెళ్లి ఊరేగింపు...సీన్ కట్ చేస్తే...) -
హైదరాబాద్: చికెన్ బిర్యానీలో బల్లి.. కంగుతిన్న కార్పొరేటర్
-
హైదరాబాద్: చికెన్ బిర్యానీలో బల్లి.. కంగుతున్న కార్పొరేటర్
సాక్షి, హైదరాబాద్: అసలే ఆకలి. అందునా ఆర్డర్‌చేసిన చికెన్ బిర్యానీ రానే వచ్చింది. ఇంకేముంది! ఒక పట్టుపట్టడమే అనుకున్నాడా వ్యక్తి. కానీ, ఆబగా సగం బిర్యానీ తిన్న తర్వాత పగవాడికీ రాని పరిస్థితి అతనికి తలెత్తింది. బిర్యానీలో బల్లి దర్శనమిచ్చింది. యాక్! అనుకుంటూ తిన్న బిర్యానీ వాంతి చేసుకున్నాడు. ఇది ఎక్కడో ఏ మారుమూలో జరగలేదు. మన హైదరాబాద్‌లో.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉండే ఒక ప్రముఖ రెస్టారెంట్లో శుక్రవారం వెలుగుచూసిందీ ఘటన. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న చికెన్ బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది. రాంనాగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాడు. సగం బిర్యానీ తిన్న తర్వాత అందులో బల్లి కనిపించడంతో షాక్ అయ్యాడు. దీంతో కంగుతిన్న కార్పొరేటర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బిర్యానీని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపించారు. అదే విధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: వికారాబాద్: పెళ్లయిన 20 రోజులకే.. -
వైరల్: గాడ్జిల్లా షాపింగ్‌కు వెళ్తే..
-
బల్లిపై బలాత్కారం
ముంబై: కామాంధులకు కన్నుమిన్ను కానదన్నది మరోమారు నిరూపించారు మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులు. మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వు ఫారెస్టులో వేటకు వెళ్లిన నలుగురు వేటగాళ్లు కామంతో బెంగాల్ మానిటర్ బల్లిపై సామూహిక అత్యాచారం జరిపారని అధికారులు చెప్పారు. వీరిని సందీప్ తుకారాం, పవార్ మంగేశ్, జనార్ధన్, అక్షయ్ సునీల్‌గా గుర్తించారు. అడవిలో అనుమతి లేకుండా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు వీరి మొబైల్స్‌ను చెక్ చేశారు. వీరంతా కలిసి బల్లిని గ్యాంగ్ రేప్ చేసిన వీడియో చూసిన అధికారులు వీరిపై కేసు నమోదు చేశారు. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం బెంగాల్ మానిటర్ లిజార్డ్‌ను రిజర్వ్డ్ జాతిగా గుర్తించారు. వీరి నేరం రుజువైతే 7ఏళ్ల కారాగార శిక్ష పడవచ్చు. చదవండి: (వివాహేతర సంబంధం మోజులో... భర్త దారుణ హత్య) -
వైరల్ వీడియో: రెస్టారెంట్లో ఉడుము ప్రత్యక్షం.. బోరున ఏడ్చిన మహిళ.. చివరికి!
బ్యాంకాక్: మనుషులకు భయాలు ఉండడం సహజం. కొందరు చిన్నచిన్న విషయాలకు కూడా జంకుతుంటారు.కొందరికి ఎత్తైన ప్రాంతాలంటే భయం, మరికొందరికి పాములు, కుక్కలు, బొద్దింకలు అంటే భయం. భయపడే ప్రాణాలు కళ్ల ముందు కనబడితే వాటి నుంచి ఆమడ దూరం పారిపోతుంటారు. ఇలాంటి ఎన్నో ఘటనలు చూసే ఉంటాం. తాజాగా ఓ మహిళ ఉడుమును (మానిటర్ లిజర్డ్) విపరీతంగా భయడింది. ఈ ఘటన థాయిలాండ్‌లోని ఓ రెస్టారెంట్లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నారాతివాత్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మహిళ కూర్చీలో కూర్చొని ఉండగా బయట నుంచి అక్కడికి ఓ ఉడుము వచ్చి చేరుతుంది. తోకను ఊపుతూ, నాలుకను బయటకు చూపుతూ భయపెట్టింది. దీంతో మహిళ కెవ్వుమని కేకలు వేస్తూ కూర్చీ మీద నిల్చుంటుంది. అంతేగాక చిన్నపిల్లలా గుక్కపెట్టి ఏడ్చేసింది. ఇంతో షాప్‌లోని ఓ యువకుడు ఆ ఉడుమును పట్టుకునేందుకు పయత్నించినప్పటికీ వీలుపడలేదు. అయినా అది లొంగకుండా అతనిపై ఎదరుదాడికి ప్రయత్నించింది. చదవండి: Viral Video: రెప్పపాటు ఘటన.. కొంచెం ఆలస్యం అయితే యువకుడి ప్రాణం పోయేది.. మహిళను ఏడుపుని చూడలేక ఇంతలో ఆ యువకుడు ఓ పొడవైన కర్రను తెచ్చి ఉడుము తల మీద బలంగా నొక్కి పెట్టాడు. అలా దానిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. అప్పటికే ఏడుస్తున్న మహిళ కళ్లు తుడుచుకుంటూ కూర్చీ దిగి నవ్వేసింది. దీనికి సంబంధించిన వీడియోని యూట్యూబ్‌లో ఫిబ్రవరి 9న పోస్టు చేశారు. 56 సెకన్ల నిడివి గలఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మహిళ ప్రవర్తనపై నవ్వులు చిందిస్తున్నారు. ‘ఉడుమును చూసి మహిళ బయపడటం కాదు.. పాపం ఉడుమే మహిళను చూసి భయపడి ఉంటుంది.’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
స్పైడర్ మాన్ ‘బల్లి’..! సోషల్ మీడియాలో ఫోటో వైరల్
Spider Man lizard: స్పైడర్ మాన్ సీరిస్‌లో భాగంగా తాజాగా ‘స్పైడర్ మాన్: నో వే హోమ్’ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా అచ్చంగా స్పైడర్ మాన్‌ను పోలినట్లు ఉన్న ఒక జాతి బల్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సాధారంగా గోదుమ రంగులో ఉండే బల్లి మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ బల్లి మాత్రం అందుకు భిన్నం నీలం, ఎరుపు రంగులో ఉండి ఆకర్షిస్తోంది. ఈ బల్లి ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) ఆఫీసర్ సుశాంత నంద డిసెంబర్ 21న తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. Spider-Man in real life… DYN that the Mwanza flat-headed rock agama, referred to sometimes as Spider-Man agama, climbs up vertical walls like the reel life spider man😊😊 pic.twitter.com/ydpZvFNUvY — Susanta Nanda IFS (@susantananda3) December 21, 2021 అదేవిధంగా ‘రియల్ లైఫ్ స్పైడర్ మాన్’ అని కామెంట్ కూడా జతచేశారు. స్పైడర్ మాన్‌గా కనిపిస్తున్న బల్లి ఎక్కువగా టాంజానియా, రువాండా, కెన్యా దేశాల్లో కనిపిస్తుంది. అయితే ఈ జాతి మగ బల్లి తల, భుజాలు ఎరుపు రంగులో ఉండగా.. మిగతా శరీరం నీలం రంగులో ఉంటుంది. బల్లి ఫోటోను చూసిన నెటిజన్లు.. తమ అభిమాన సూపర్ హీరోతో పోలికలు ఉన్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ బల్లి అచ్చం స్పైడర్ మాన్లా ఫోజు పెట్టింది’.. ‘ఎట్టకేలకు స్పైడర్ మాన్ ఫ్యాషన్ డిజైనర్‌ను పొందాను’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!
రెండు తలల పాములను చూసి ఉంటాం. అంతేందుకు అవిభక్త కవలలు అంటూ మనుషులను కూడా చూసి ఉంటారు. అయితే రెండు తలలు బల్లులను ఎప్పుడైన చూశారా. అంతేకాదు అవి ఉంటాయని కూడా అనుకోరు. అసలు విషయంలోకెళ్లితే...ఇక్కడొక రెండు తలలతో చాలా వింతగా కూడా ఉంది. పైగా దాని నాలుక నీలి రంగులో ఉంటుందట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ!. అయితే దీనికి సంబంధిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: గతేడాది చనిపోతే!... ఇప్పుడు మృత దేహాలను ఇచ్చారు!!) View this post on Instagram A post shared by Jay Brewer (@jayprehistoricpets) -
ఒక తొండ.. 4 గంటలు కరెంట్ కట్!
సాక్షి, డోర్నకల్: ఓ తొండ గురువారం అర్ధరాత్రి విద్యుత్ సిబ్బందికి చుక్కలు చూపించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి 8.15 గంటల నుంచి 12.05 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనికితోడు వర్షం పడటం, విపరీతంగా దోమలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో వైపు విద్యుత్ సరఫరా అంతరాయానికి కారణమేమిటని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది వెతుకులాట ప్రారంభించారు. సబ్‌స్టేషన్‌లో ఎలాంటి సమస్య లేకపోవడంతో ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజనీర్, ఇతర ఇబ్బంది సబ్ స్టేషన్ నుంచి రైల్వే ట్రాక్ వరకు 11 కేవీ లైన్‌కు సంబంధించి సుమారు 30 స్తంభాలపైకి ఎక్కి పరిశీలించారు. చివరకు రైల్వే ట్రాక్ సమీప స్తంభంపైన ఉన్న కండక్టర్ ఇన్సులేటర్ మీద తొండ పడి చనిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు గుర్తించారు. వెంటనే తొండను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. చదవండి: మహబూబ్‌నగర్ జిల్లాలో హైవేపై ట్రక్కు బీభత్సం -
ఉసురుతీసిన ఉడుముల వేట
డోర్నకల్: ఉడుములు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు రెండు బండరాళ్ల మధ్య చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారానికి చెందిన జక్కుల వెంకన్న సోమవారం ఉదయం ఉడుములు పట్టేందుకు ఖమ్మం రూరల్ మండలం పొడిశెట్టిగూడెం గ్రామ పరిధిలోని గుట్టపైకి వెళ్లాడు. ద్విచక్ర వాహనం, రెండు పెంపుడు కుక్కలతో వెళ్లిన ఆయన.. మంగళవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. దీంతో అతని ఆచూకీ కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో పొడిశెట్టిగూడెం సమీపంలోని గుట్ట సమీపంలో ద్విచక్రవాహనం నిలిపి ఉండటం, సమీపంలో కుక్కలు కనిపించడంతో గుట్టపైకి వెళ్లి వెతకగా.. రెండు బండరాళ్ల మధ్య వెంకన్న మృతదేహం కనిపించింది. ప్రొక్లయినర్‌తో భారీ బండరాయిని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఖమ్మం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం..) -
వైరల్ వీడియో: బల్లికి ఆహారంగా పురుగు
-
బల్లికి ఆహారంగా పురుగు, ఎలా అందించారనేదే మేటర్!
బల్లిని చూస్తేనే చాలా మందికి విపరీతమైన భయం. అదెక్కడో గోడ మీద కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెత్తేవారు ఉంటారు. అలాంటిది బల్లి మీద పడితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చదవబోయే న్యూస్‌లో అంతకు మించిన మ్యాటర్ ఉంది. ఇక్కడ బల్లి దాని యజమాని పెదవుల మీద ఉన్న పురుగును అమాంతం నోట్లో వేసుకుంది. యాక్ అనిపించినా ఇది వాస్తవం. ఆ వివరాలు.. సరీసృపాల జూ వ్యవస్థాపకుడు జే బ్రూవర్ తన జూలోని జంతులాలతో ఎంతో ప్రేమగా ఉంటారు. వాటిని స్వయంగా ఆహారం అందించి మురిసిపోతుంటాడు. తాజాగా ఆయన ఓ పెద్ద బల్లికి పురుగుని ఆహారంగా అందించాడు. మాములుగా ఇస్తే.. ఓకే! కానీ అతను తన పెదవులపై ఆ పురుగును ఉంచుకోగా.. బల్లి వేగంగా దాన్ని తన పొడవాటి నాలుకతో నోట కరుచుకుంది. అందుకనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటివెన్నో జే బ్రూవర్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. (చదవండి: ఇది నిజంగా ముంబైలో జరిగిందా?) -
సాంబార్లో సగం బల్లి..
-
సాంబార్లో సగం బల్లి.. మిగతాది ఏమైనట్లు?!
న్యూఢిల్లీ: అసలే ఇది కరోనా కాలం. హోటళ్లలో భోజనం చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. అనవరసరంగా ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు అని శుభ్రంగా ఇంట్లోనే తింటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ హోటల్లో టిఫిన్ చేసిన ఓ వ్యక్తికి భయంకరమైన అనుభవం ఎదరయింది. దోశ తింటుండగా సాంబారులో బల్లి ప్రత్యక్షమైంది. కన్నాట్ ప్లేస్‌లో దక్షిణాది వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఓ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. వివరాలు.. కొందరు వ్యక్తులు టిఫిన్ చేసేందుకు ఢిల్లీలోని పాష్ ఏరియా.. లగ్జరీ హోటళ్లకు ప్రసిద్ధి చెందిన కన్నాట్‌కు వెళ్లారు. అక్కడ దక్షిణాది వంటకాలకు ఫేమస్ చెందిన ఓ రెస్టారెంట్‌కు వెళ్లి సాంబార్, దోశ ఆర్డర్ ఇచ్చారు. టిఫిన్ వచ్చాక.. తినడం ప్రారంభించారు. ఇంతలో ఓ వ్యక్తికి సాంబారులో బల్లి కనిపిచింది. ఐతే సగం బల్లి మాత్రమే ఉండటంతో వణికిపోయాడు. మిగతా సగం బల్లి ఎక్కడుంది.. వేరే వారికి వెళ్లిపోయిందా.. లేదంటే కొంపదీసి తనే తిన్నానా ఏంటి అని భయడిపోయాడు. వెంటనే హోటల్ మేనేజర్ని పిలిచి నిలదీశాడు. అందరిపై విరుచుకుపడి నానా రచ్చ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (వంటింటి వైద్యంతో కరోనా ‘ఆవిరి’) 'నా నోటి నుంచి ఈ బల్లిని తీశాను. సగమే ఉంది. మిగతా సగం నేనే తిన్నానా? లేదంటే హోటల్ కిచెన్‌లోని సాంబారు గిన్నెలోనే ఉండిపోయిందా? లేదంటే ఇతరులకు వడ్డించారా?' అని ఆ కస్టమర్ వాపోయాడు. అనంతరం రెస్టారెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిచెన్‌తో పాటు హోటల్లో ఉన్న సీసీ ఫుటేజీ ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే దోశ తయారీకి వాడే పదార్థాల వివరాలను అందజేయాలని ఆదేశించారు. -
జూమ్ చేసినా బల్లి కనిపించట్లేదు..
కరోనా వార్తలతో మీ బుర్ర వేడెక్కిందా.. గుండెకు గుబులు పుట్టించే వార్తలు చదివీ మనసు ఆందోళనగా మారుతోందా? అందుకే మీకోసం ఈ పజిల్. మీ టెన్షన్లన్నీ పక్కనపెట్టి సరదాగా ఈ పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి. మెదడుకు మేతతోపాటు, మనసుకు కాస్త స్వాంతన చేకూరుతుంది. ఇంతకీ పైన కనిపిస్తున్న ఫొటోలో ఏముంది.. రోడ్డు.. ఆ పక్కన చెట్టు వేర్లు, లేదా కాండం. దాని పక్కనే ఎండిన మొక్కల పొద కూడా ఉంది. వీటితోపాటు ఓ జీవి కూడా ఉందండోయ్.. ఇందులో చాలామందికి పేరు తలుచుకుంటేనే జలదరించే బల్లి కూడా ఉంది. (బంగారు బల్లి.. మళ్లీ దర్శనం) ఇంకేం.. భూతద్దం పట్టుకుని వెతికేయండి మరి.. ఇప్పటికే చాలామంది వెతికి వెతికి అలిసిపోతున్నారే తప్ప దాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. మరికొందరు మాత్రం "బల్లి ప్రాణం మా చావుకొచ్చింది.." అంటూ కామెంట్లు చేస్తున్నారు. "ఎంత జూమ్ చేసినా కనిపించట్లేదురా బాబోయ్" అంటూ చేతులెత్తేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రం "హేయ్.. దొరికేసిందోచ్.." అంటూ ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ మీరు కూడా కళ్లు పెద్దవి చేసి తెగ వెతికేస్తున్నట్లున్నారు. ఇప్పటికీ దాని జాడ గుర్తించకపోతే శ్రమించడం మాని ఈ ఫొటో చూసేయండి. (ఉడుము బిర్యానీ అదరహో!) -
బల్లి నోట్లో నోరు పెట్టాడు..
కాన్బెర్రా: ‘ఇదేందిది.. ఓరీ నీయమ్మ భడవా.. ఇది నేను చూడలా’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. అసలు విషయం చెప్తే మీరు కూడా ఇదే మాటంటారు కాబోలు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి స్థానిక బార్‌కు వెళ్లి బీర్ ఆర్డర్ చేశాడు. సిబ్బంది అతనికి గ్లాసులో బీరును అందించారు. ఇక తాగడం మొదలెడదాం అనుకున్న అతనికి గ్లాసులో బల్లి కనిపించింది. సాధారణంగా ఎవరైనా సరే ఈ విషయానికి కోపగించుకుని వెంటనే బార్ సిబ్బందితో గొడవకు దిగి రచ్చరచ్చ చేస్తాం. కానీ ఆ వ్యక్తి అలా చేయలేదు. పైపెచ్చు.. బార్ సిబ్బంది తనతో తమాషాలాడుతున్నాడనుకున్నాడు. తనను ప్రాంక్ చేసేందుకు కావాలనే ఆ ప్రాణిని బీర్లో వేశారని భావించాడు.(బిర్యానీలో చచ్చిన బల్లులను కలుపుతూ..) దీనిపై స్పందించిన సిబ్బంది అనుకోకుండా పడిందని పేర్కొనడంతో అతను వెంటనే దాన్ని గ్లాసులో నుంచి సునాయాసంగా బయటకు తీశాడు. పాపం.. బీర్లో మునిగిన దానికి ఊపిరాడుతుందో లేదోనని పరీక్షించాడు. అనుమానం వచ్చిన అతను వెంటనే దాన్ని రక్షించేందుకు సిద్ధమయ్యాడు. మరో ఆలోచనే లేకుండా బల్లి నోటిలో నోరు పెట్టి దానికి శ్వాసనందించి ప్రాణం పోశాడు. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీనికి నెటిజన్లు ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో ఆ ప్రాణిని కాపాడినందుకు మెచ్చుకుంటుంటే మరికొందరేమో అతడు చేసిన పనికి మాకు దిమ్మతిరిగిపోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. (కదలకుండా అదే స్థానంలో ఏడేళ్లు ఎలా?) -
బల్లి నోటిలో నోరు పెట్టాడు
-
భయానకం: తలక్రిందులుగా వేలాడుతూ..
దిష్టి తగలకుండా సాధారణంగా మనం ఇంటి ముందు గుమ్మడికాయను వేలాడదీస్తాం. అయితే ఓ కొండచిలువ ఇంటిపై కప్పు నుంచి తలక్రిందులుగా వేలాడుతూ భారీ బల్లిని మింగుతున్న దృశ్యాన్ని చుశారా. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే ఈ సంఘటన అస్ట్రేలియాలోని రిటైర్మెంట్ విలేజ్‌లో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాలు.. క్వీన్ ల్యాండ్‌లోని జాతీయ పార్క్‌కు సమీపం ఉన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కమ్యూనిటి హోమ్ టౌన్ రిటైర్మెంట్ విలేజ్‌లోని ఓ ఇంటి గుమ్మం ముందు కొండ చిలువ నోటితో బల్లిని మింగుతూ తలకిందులుగా వేలాడుతూ కనిపించింది. దీంతో అది చూసిన ఆ ఇంటి యాజమాని ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ భయానక దృశ్యాన్ని సెల్‌ఫోన్ చిత్రీకరించి తన ఫేస్బుక్లో షేర్ చేశాడు. ‘ఓ విషరహిత సర్పం తనకిందులుగా వేలాడుతూ బల్లిని ఆహారంగా తీసుకుంటున్న అరుదైన దృశ్యం’ అంటూ ఫేస్బుక్లో రాసుకొచ్చారు. అది చూసిన నెటిజన్లు ‘ఎంత.. అద్భుతమైన చిత్రం’, ‘ఈ విలేజ్ జాతియ పార్క్‌ను తలపించేలా ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ విలేజిలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం కొత్తెమీకాదు. ఇంట్లోని సోఫాలపై, బాల్కానిలో పెంపుడు జంతువుల్లా ఎప్పుడూ మనుషుల మధ్య తిరుగుతున్న దృశ్యాలు ఇప్పటికే వైరల్‌గా మారాయి. కాగా సౌత్ ఈస్ట్, నార్త్ ఆస్ట్రేలియాలో ఇంట్లో బిల్డింగ్‌లపై, చెట్లపై ఇవి ఇలా వేలాడుతూ ఉండటం సర్వసాధారణం. -
బిర్యానీలో చచ్చిన బల్లులను కలుపుతూ....
సాక్షి, గుంతకల్లు: బల్లి పడిని బిర్యానీని ఇచ్చారంటూ రైల్వే క్యాంటీన్ నిర్వాహకులను బెంబేలెత్తించి, నగదు దండుకోవాలనుకున్న ఓ ప్రయాణికుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఛత్రపతి శివాజీ టర్మినల్–కోయంబత్తూరుకు వెళ్లే కుర్లా ఎక్స్‌ప్రెస్ గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు చేరుకుంది. అందులో ప్రయాణిస్తున్న సుందర్‌పాల్ అనే ప్రయాణికుడు 4వ ప్లాట్ఫారంలో ఉన్న మారయ్య రైల్వే క్యాంటీన్లో వెజ్ బిర్యానీ కొనుగోలు చేశాడు. అనంతరం అందులో బల్లి పడిందంటూ నేరుగా వెళ్లి డిప్యూటీ రైల్వే స్టేషన్ మాస్టర్ జార్జ్, కమర్షియల్ మేనేజర్ అనూక్‌కు ఫిర్యాదు చేశాడు. కంగారు పడ్డ వారు వెంటనే రైల్వే ఆస్పత్రి వైద్యురాలు భార్గవిని పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించారు. అదే సమయంలో రైల్వే అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. బాధితుడిగా భావిస్తున్న సుందర్‌పాల్ పచ్చి మోసగాడుగా రైల్వే అధికారులు తేలింది. కావాలనే అన్నంలో చచ్చిన బల్లులను కలిపి రైల్వే క్యాంటీన్ యజమానుల బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజేవాడిగా తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని డీసీఎం కుమార్‌గౌరవ్, సీటీఐ వై.ప్రసాద్ స్పష్టం చేశారు. నాలుగు రోజుల క్రితం జబల్పూర్ రైల్వేస్టేషన్లో ఇలానే సమోసలో బల్లి వేసి నాటకమాడి ఆ కాంట్రాక్టర్ నుంచి రూ.30వేలు గుంజినట్లుగా తేలిందన్నారు. తిరిగి గుంతకల్లులోనూ అదే తరహాలో కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ. 5 వేలు డిమాండ్ చేశాడని, దీనిపై అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసిందని వివరించారు. రైల్వే అధికారులు విచారణలో తాను వేసింది బల్లి కాదని సముద్రపు చేప అంటూ సుందర్‌పాల్ ధ్రువీకరించాడు. డబ్బు కోసం నాలుగైదు ప్రదేశాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. -
గరం గరం వడ సాంబార్.. తింటే షాక్..!
ముంబై : పొద్దుగళ్ల పొద్దుగళ్ల వడ సాంబార్ తినాలని ప్రతిఒక్కరు ఆరాటపడతారు. ఇక నాగ్‌పూర్‌లోని అజానీ స్క్వేర్‌లో స్నాక్స్ తయారీలో పాపులర్ అయిన హల్దీరామ్ నిర్వహిస్తున్న ఓ హోటల్‌కు జనం ఎగబడతారు. అక్కడ టిఫిన్స్ శుచిగా శుభ్రంగా ఉంటాయిన క్యూ కడతారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా అదే చేశాడు. తన భార్యతో కలిసి వడ సాంబార్ ఆర్డర్ చేశాడు. సగం తిన్న తర్వాత ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సాంబార్లో బల్లి ప్రత్యక్షమవడంతో విషయం హోటల్ నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చారు. నిర్వాహకులు బాధితులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, సాంబార్లో బల్లిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ విషయమై సదరు హోటల్‌ను తనిఖీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టామని ఎఫ్‌డీఏ (నాగ్‌పూర్) కమిషనర్ మిలింద్ దేశ్‌పాండే తెలిపారు. కిచెన్‌లో ఉన్న లోపాలను గుర్తించామని, ఆహార భద్రతా, నాణ్యతా ప్రమాణాలకు లోబడి హోటల్ నడుచుకునే విధంగా ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు. కిటీకీలకు తెరలు బిగించాలని ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. అప్పటివరకు హోటల్‌ను మూసేయించామని వివరించారు. ఇక కస్టమర్ లేవెనెత్తిన ఆరోపణలపై తమకు అనుమానాలు ఉన్నాయని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. బాధితులకు చికిత్సనందించామని.. వారికి ఆరోగ్యానికి బాగానే ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయని వెల్లడించారు. హోటల్ నిర్వహణకు సంబంధించి అధికారులకు తగు పత్రాలు అందిచామని తెలిపారు. ఇక బాధితులు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. వారు ఎవరిపైనా ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. -
మధ్యాహ్న భోజనంలో బల్లి
సోమందేపల్లి:మండలంలోని చాలకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనంలో బల్లి ప్రత్యక్షమైంది. 30 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 1 నుంచి మధ్యాహ్న భోజన ఏజెన్సీలను తొలగించి నవ ప్రయాస సంస్థ ద్వారా పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి మండలాలకు భోజనాన్ని సరఫరా చేయిస్తోంది. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం సంస్థ సిబ్బంది భోజనాన్ని పాఠశాలకు తీసుకొచ్చారు. దాదాపు 309 మంది విద్యార్థులకు భోజనం వడ్డించడం ప్రారంభించారు. ఈ మేరకు 30 మందికి భోజనం వడ్డించగా వారు భోజనం తినేశారు. ఇంతలో టెన్త్ విద్యార్థి అనూ ప్లేట్లోని అన్నంలో బల్లి కనిపించింది. దీంతో ఆమె ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లింది. హెచ్ఎం వహీదాఖానం వెంటనే భోజనాన్ని విద్యార్థులకు అందించకుండా నిలిపివేశారు. అంతుకుమందు భోజనం తిన్న 30 మంది విద్యార్థులు కళ్లు తిరుగుతున్నాయంటూ తెలిపారు. కొంతమంది విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు.పాఠశాల సిబ్బంది సోమందేపల్లి ప్రాథమిక కేంద్రంపు వైద్య సిబ్బందిని పిలిపించి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు నరేష్ తెలపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.కాగా అక్కడికి చేరుకున్న నవప్రయాస సంస్థ మూడు మండలాల కిచెన్ ఇన్చార్జ్ వీరేంద్రను విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిలదీశారు. దాదాపు 3.30 నిమిషాల వరకు విద్యార్థులకు భోజనం అందకపోవడంతో ఇబ్బంది పడ్డారు. తల్లిదండ్రుల ఆందోళన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దు చేరుకొని తమ పిల్ల ల క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తాజా, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసప్ప గ్రామ పెద్ద లు షఫీ, అంజినప్ప, త్రినాథ్ జగదీష్ తదితరులు విద్యార్థుల తల్లి దండ్రులకు మద్ద తు పలికారు. భోజనం నాణ్యతగా లేదని ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు వచ్చిన ఎందుకు కొనసాగిస్తున్నారంటూ వారు అధికారులపై మండిపడ్డారు. అనంతరం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందివ్వాలని కోరుతూ ఎంఈఓ ఆంజనేయులునాయక్‌కు వినతిపత్రం అందజేశారు. -
కూల్ డ్రింక్ బాటిల్లో బల్లి
విజయవాడ: కూల్ డ్రింక్ బాటిల్లో బల్లి ఆకారం కనిపించడంతో దానికి కొనుగోలు చేసిన వ్యక్తి కలవరపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బందరు రోడ్డులోని ఓ కంపెనీలో పనిచేస్తున్న కె.పూర్ణేష్బాబు మొగల్రాజపురంలోని రిలయన్స్మార్ట్లో ఇటీవల ఓ కేస్ కూల్‌డ్రింక్ బాటిళ్లను కొనుగోలు చేశారు. శుక్రవారం ఆయన తన ఇంటికి వచ్చిన అతిథులకు కూల్ డ్రింక్ ఇచ్చేందుకు కేస్‌లోంచి ఓ బాటిల్ తీశారు. అందులో బల్లిఆకారంలో ఉన్న పురుగు కనపడింది. డ్రింక్ బాటిల్లో బల్లి ఆకారం ఉండటంతో పూర్ణేష్బాబు రిలయన్స్ మార్ట్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. రిలయన్స్ సిబ్బంది దాన్ని చూసి అది ఫంగస్ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆహార తనిఖీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితుడు మీడియాకు తెలిపారు. -
‘భోజనం’లో బల్లి!
సాక్షి, విశాఖపట్నం: శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలవుతోంది. బడిలో పిల్లలు ఆకలితో ఆవురావురంటున్నారు. భోజనం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో అన్నంతో నిండిన బేసిన్లు వచ్చాయి. ఇక వడ్డనకు సిద్ధమవుతుండగా ‘ఆపండి ఆపండి.. పిల్లలకు భోజనం వడ్డించకండి’ అంటూ హెడ్మాస్టర్ల నుంచి ఆదేశం! ఏమయిందో తెలియక పిల్లలంతా ఆందోళన.. ఆశ్చర్యం!! కాసేపటికి తెలిసింది... జీవీఎంసీ స్కూళ్లలో పిల్లలకు ఇస్కాన్ సంస్థ సరఫరా చేసే మధ్యాహ్న భోజనంలో బల్లి పడిం దని. దీంతో ఆ భోజ నాన్ని పిల్లలకు వడ్డించకుండా నిలిపివేశారు. అసలే జరిగిందంటే.. నగరంలోని ప్రకాశరావుపేట మున్సిపల్ పాఠశాలలో పిల్లలకు తెచ్చిన మధ్యాహ్న భోజనంలో బల్లి పడినట్టు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుర్తించారు. వెంటనే సాటి ఉపాధ్యాయులతో పాటు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) బి.లింగేశ్వరరెడ్డికి సమాచారం అందించారు. డీఈవో అప్రమత్తమై జీవీఎంసీ విద్యాశాఖ అధికారులకు, ఆయా మున్సిపల్ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్లు పంపించారు. శుక్రవారం ఇస్కాన్ సంస్థ సరఫరా చేసిన మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు వడ్డించవద్దని, దీనిని సీరియస్‌గా తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఆ సందేశాలను అందుకున్న ఉపాధ్యాయులు ఎక్కడికక్కడే ఆ భోజనం పిల్లలకు అందజేయకుండా నిలిపివేశారు. మధ్యాహ్న భోజనానికి బదులు అరటిపళ్లు, బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేసి వారి ఆకలి తీర్చారు. జీవీఎంసీ పరిధిలో 147 మున్సిపల్ స్కూళ్లున్నాయి. వీటిలో 69 పాఠశాలలకు ఇస్కాన్, మిగిలిన వాటికి అక్షయపాత్ర సంస్థలు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాయి. ఇస్కాన్ సంస్థ ఈ 69 స్కూళ్లలో సుమారు 15 వేల మంది పిల్లలకు భోజనం సమకూరుస్తోంది. విచారణ జరుపుతున్నాం ప్రకాశరావుపేట మున్సిపల్ స్కూల్లో మధ్యాహ్నం భోజనంలో బల్లి పడినట్టు ఆ పాఠశాల హెడ్మాస్టార్ గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమై ఇస్కాన్ సరఫరా చేస్తున్న ఆయా మున్సిపల్ స్కూళ్లలో పిల్లలకు భోజనం వడ్డించ వద్దని ఆదేశాలిచ్చాం. ఇస్కాన్ సంస్థ కార్యాలయానికి వెళ్లి అక్కడ పరిసరాలను పరిశీలించాను. ఎక్కడా అపరిశుభ్రత కనిపించలేదు. ఇస్కాన్ నిర్వాహకులకు నోటీసులిచ్చాం. బల్లి పడిన ఘటనపై విచారణ జరుపుతున్నాం.– బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో -
చికెన్ బిర్యానీలో బల్లి...రెస్టారెంట్ సీజ్
-
బిర్యానీలో బల్లి.. ఇద్దరికి అస్వస్థత
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఓ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీలో బల్లి రావడం కలకలం రేపుతోంది. రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వలనే ఇలా జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈ సంఘటన నగరంలోని టీచర్స్ కాలనీలోని ఓ రెస్టారెంట్లో శుక్రవారం చోటుచేసుకుంది. బల్లి పడిన చికెన్ బిర్యానీ తిని ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. బిర్యానీ తిన్న వారు వాంతులు చేసుకోవడంతో వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు బల్లిపడిన చికెన్ బిర్యానీని స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు బల్లి పడిన బిర్యానీ వడ్డించిన రెస్టారెంటుని పరిశీలించారు. రెస్టారెంట్‌లోని వంటశాల తనిఖీ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్ధాలను తయారీ చేస్తున్నట్లు నిర్ధారించారు. అధికారులు ఆహార పదార్ధాల శాంపిళ్లను సేకరించి, రెస్టారెంట్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు. -
గేదె కొమ్ములతో సింహాన్ని ఎత్తి కొట్టింది
-
ఎత్తి కొడితే.. ఎగిరి పడింది..
దక్షిణాఫ్రికా: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వం అనిపించుకుంటుంది. కానీ నేటి కాలంలో మానవత్వం మాట దేవుడెరుగు..! కనీసం ఇతరులకు కీడు తలపెట్టకుండా ఉంటే చాలు. ఈ విషయంలో పశుపక్ష్యాదులు మినహాయింపు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అవి స్పందిస్తాయి. సహాయం కోసం అర్థిస్తున్న వాళ్లకు చేయూతనందిస్తాయి. తక్షణం స్పందించి వాటికి తోచిన రీతిలో ఇతర మూగ జీవాలకు తోడుగా నిలుస్తాయి. సింహాల బారిన పడి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న ఓ భారీ సైజు బల్లిని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ గేదె కాపాడింది. తుపాను వేగంతో అక్కడికి చేరుకుని ఆ సింహాల గుంపుని చెండాడింది. ఈ సంఘటన క్రూగర్ జాతీయ పార్కులో ఇటీవల చోటుచేసుకుంది. సింహాల గుంపు ఆ బల్లిని పీక్కు తినేందుకు సిద్ధమౌతున్న వేళ ఆ గేదె చాకచక్యంగా దాన్ని రక్షించింది. క్షణం ఆలస్యమైనా ఆ బల్లి ప్రాణాలు హరీమనేవే. అందుకనే కోపం పట్టలేని గేదె ఒక్క ఉదుటున బల్లిని తన కాలికింద తొక్కిపట్టిన సింహం మీదకి దుమికింది. అపాయం నుంచి బల్లి బయటపడగానే తన రెండు కొమ్ములతో ఆ సింహాన్ని ఎత్తి కొట్టింది. గాల్లో గింగిరాలు తిరుగుతూ కింద పడిన ఆ సింహం కుయ్యో, ముర్రో అంటూ అక్కడ్నుంచి జారుకోగా, మిగతా సింహాలు కూడా దాన్ని అనుసరించాయి. పార్కుని సందర్శిస్తున్న స్యూన్ ఎలోఫ్ అనే వ్యక్తి ఈ సాహస కృత్యాన్ని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. -
పుల్ల ఐసు కాదు.. బల్లి ఐసు
సాక్షి, లేపాక్షి (అనంతపురం): మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన కుమారస్వామి గురువారం ఉదయం పుల్లయిసు కొనుక్కున్నాడు. కొంచెం తినగానే పుల్లకు అతుక్కుపోయిన బల్లి కనిపించింది. ఇది పుల్లనా, బల్లినా అని చూసుకోకుండా ఐస్ తయారు చేస్తారా అంటూ గ్రామస్తులు ఐస్ బండి తీసుకొచ్చిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకేమీ తెలియదని, హిందూపురంలోని తిరుమల ఐస్‌క్రీం కంపెనీవాళ్ల దగ్గర కొనుగోలు చేసి అమ్ముకుంటూ బతుకుతున్నానని ఆ వ్యక్తి విచారం వ్యక్తం చేశాడు. -
లేడీస్ హాస్టల్లో భయానక బల్లి!
ఢిల్లీ: కాలేజీకి రెడీ అవుదామని బాత్రూమ్లోకి వెళ్లిన ఆ విద్యార్థిని ఒక్కసారే గావుకేక పెట్టింది.. ఏం జరిగిందోనన్న కంగారుతో లేడీస్ హాస్టల్లోని విద్యార్థునులంతా పరుగున వచ్చారు.. అంతకుముందెన్నడూ చూడనంత పెద్ద బల్లిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆలస్యం చేయకుండా కాలేజీ యాజమాన్యానికి కబురుపెట్టారు. నిమిషాల వ్యవధిలోనే వణ్యప్రాణి సంరక్షకులు వచ్చారు.. అది ఆఫ్రికా జాతికి చెందిన విషపూరిత బల్లిగా గుర్తించారు.. జాగ్రత్తగా మత్తుమందు ఎక్కించి, వెంటతీసుకెళ్లారు!! ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని నేతాజీ సుభాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఎస్ఐటీ)లో మే 16 చోటుచేసుకుందీ ఘటన. దట్టమైన చెట్ల మధ్యలో ఉండే ఆ క్యాపస్‌లో ఇలాంటి జీవిని ఇదివరకెప్పుడూ చూడలేదని విద్యార్థులు పేర్కొన్నారు. అంతకుముందురోజే భారీ వర్షం కురిసిన విషయాన్ని గుర్తుచేశారు. పెద్ద బల్లి ఘటన తర్వాత విద్యార్థినులంతా తమ గదుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆఫ్రికా జాతికి చెందిన ఆ విషపూరిత బల్లి కుడితే.. ప్రాణాపాయం ఉండనప్పటికీ తీవ్రమైన అనారోగ్యం, విపరీతమైన నొప్పి కలుగుతాయని వణ్యప్రాణి సంరక్షకులు వివరించారు. -
ప్రసాదంలో బల్లి.. 73 మందికి అస్వస్థత
చెన్నై : ఓ ఆలయంలో ప్రసాదం తిన్న 73 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన తమిళనాడులోని కడులూరు జిల్లాలోని శతమంగళం గ్రామంలోని అమ్మాన్ ఆలయంలో చోటు చేసుకుంది. వేడుకల్లో భాగంగా ఆలయంలో భక్తులకు సాంబారు అన్నం పెట్టారు. ఈ ప్రసాదం స్వీకరించిన భక్తులకు తలతిరగడంతో పాటు, వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే స్థానికులు సమీప విరుదాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో 14 మంది మహిళలు ఉండగా.. ఆరుగురు చిన్నారులున్నారు. ప్రసాదంలో తమకు చనిపోయిన బల్లి కనిపించిందని భక్తులు ఆరోపించారు. ఈ ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఇదేమి సెల్ఫీ!
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంతో తమిళ తంబీలను అమితంగా ఆకట్టుకున్న బ్యూటీ రాధికా ఆప్టే. ఎంతటి స్థాయికైనా అందాలను ఆరబోయడానికి వెనుకాడని ఈ గుమ్మ డాన్స్‌కు మాత్రమే కాకుండా కథా పాత్రలో ప్రాముఖ్యత ఉంటేనే నటిస్తుంది. అసలు విషయానికి వస్తే ఆ మధ్య రాధికా ఆప్టే స్నానం చేస్తూ తీసుకున్న సెల్ఫీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో అమ్మడు అందాలను చూసిన కుర్రకారుకు దిమ్మతిరిపోయింది. అయితే ఆమె మాత్రం ఆ సెల్ఫీల్లో ఉన్నది తాను కాదని సింపుల్‌గా చెప్పేసింది. ఇదిలా ఉంటే తాజాగా రాధికా ఆప్టే మరో సెల్ఫీ విడుదలైంది. ఇందులో ఒక బల్లిని చెంపపై పెట్టుకున్న బ్యూటీ దాన్ని నాలుకతో తాకడానికి ట్రై చేస్తున్నట్టుంది. ఈ జుగుప్సాకరమైన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇంతకీ ఆ బల్లి నిజమైందా? కాదా అనే విషయం తెలియడం లేదు. -
సాంబారులో బల్లి.. శ్రీవారి భక్తుడు షాక్
సాక్షి, తిరుమల: తిరుమలలోని హోటళ్లలో మరోసారి నిర్లక్ష్యం బయటపడింది. కొండపైన ఉన్న నందకం సమీపంలోని లక్ష్మీనారాయణ హోటల్లో గురువారం ఓ భక్తుడు టిఫిన్ చేస్తుండగా సాంబారులో బల్లి ప్రత్యక్షమైంది. దీంతో షాక్‌కు గురైన భక్తుడు.. హాటల్ నిర్వాకంపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు హోటల్ ను సీజ్ చేసి.. టిఫిన్ శాంపిల్స్‌లను పరీక్షల నిమిత్తం పంపారు. ప్రస్తుతం భక్తుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సదరు వ్యక్తి నిజామాబాద్ చెందిన వారని అధికారులు తెలిపారు. -
మధ్యాహ్న భోజనంలో బల్లి
♦ విద్యార్థులకు స్వల్ప అస్వస్థత ♦ వెంటనే ఆస్పత్రికి తరలించిన ఉపాధ్యాయులు ♦ ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంకటాచలం : మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన రసం తాగి విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కంటేపల్లి దళితవాడ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. కంటేపల్లి దళితవాడ పాఠశాలలో మొత్తం 38 మంది విద్యార్థులు ఉన్నారు. రోజూలాగే అక్షయ పాత్ర ఏజెన్సీ సరఫరా చేసిన భోజనాన్ని మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డించారు. భోజనం చివరలో రసం హాట్‌బాక్సు అడుగున బల్లి చనిపోయి ఉండడాన్ని విద్యార్థులు గుర్తించారు. అప్పటికే రసంతో 8 మంది విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు రాంమోహన్, ఉపాధ్యాయిని మస్తానమ్మ భోజనం చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు ఆందోళనకు గురై మండలాధికారులకు, వెంకటాచలం క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే 108 వాహనం కంటేపల్లికి చేరుకుని రసం తాగిన ఉపాధ్యాయులతో పాటు స్వల్ప అస్వస్థతకు గురైన 8 మంది విద్యార్థులను క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. తహసీల్దార్ సోమ్లానాయక్, ఎంఈఓ కొండయ్యలు క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అక్షయపాత్ర ఏజెన్సీ సరఫరా చేసిన రసంలో చనిపోయిన బల్లి కనిపించడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. తహసీల్దార్ సోమ్లానాయక్, ఎంఈఓ కొండయ్య కాకుటూరు పంచాయతీ పరిధిలోని అక్షయపాత్ర ఏజెన్సీ వంటశాలను పరిశీలించి అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థులకు పంపే భోజనం విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. -
బీరులో బల్లి..!
ఘట్కేసర్: బంధువులతో కలసి చల్లగా బీరు తాగుదా మనుకున్న ఓ వ్యక్తికి వింత ఘటన ఎదురైంది. కొను గోలు చేసిన బీరు సీసాలో మృతి చెందిన బల్లి కనిపించ డంతో అవాక్కయ్యాడు . ఈ ఘటన మందు బాబుల్లో కలకలం రేపుతోంది. ఎల్బీ నగర్‌కు చెందిన విక్రమ్‌రెడ్డి గురువారం ఘట్కేసర్లోని బంధువుల ఇంటికి వచ్చా డు. స్థానికంగా ఉన్న ఎన్ఎఫ్సీ నగర్‌లోని టీఎస్‌బీసీఎల్ లిక్కర్ షాపులో ఐదు బీర్లను కొనుగోలు చేశాడు. తాపీగా తాగుదా మని బీర్లను ఒపెన్ చేస్తుండగా అందులోని ఒక సీసాలో మృతి చెందిన బల్లి కని పించింది. ఆందో ళనకు గురైన అతడు వాటిని పక్కన పడేశాడు. ఈ ఘటనపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. -
విమానం సీటు కింద బల్లి.. షాక్ తిన్న హీరోయిన్!
-
విమానం సీటు కింద బల్లి.. షాక్ తిన్న హీరోయిన్!
ఖరీదైన విమానంలో సీటు కింద నుంచి ఓ బల్లి వచ్చి తచ్చాడితే ఎలా ఉంటుంది. ఎవరికైనా ఒకింత వికారంగా, షాకింగ్‌గా ఉంటుంది. ఇలాంటి చేదు అనుభవమే వర్ధమాన నటి రూహి సింగ్‌కు ఎదురైంది. మధుర్ బండార్కర్ ‘క్యాలండర్ గర్ల్స్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. తమిళ చిత్రం ప్రమోషన్లో భాగంగా చెన్నైలో గడిపిన ఆమె స్పైస్‌జెట్ విమానంలో ముంబై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో మండిపడిన ఈ మాజీ మిస్ ఇండియా.. విమానాల్లో ఇంత దారుణమైన అపరిశ్రుభత ఎలా ఉంటుందంటూ విమానంలో బల్లి తచ్చాడుతున్న వీడియను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. స్పైస్‌జెట్ విమానంలో అధిక ధర చెల్లించి తాను ప్రీమియం టికెట్‌ను కొన్నానని, తీరికలేని షెడ్యూల్ నుంచి విశ్రాంతి తీసుకోవడానికి తాను ఈ టికెట్ కొంటే.. అందుకు భిన్నంగా తాను ఓ బల్లితో కలిసి ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె తన పోస్టులో వాపోయింది. తన సీటు కింద నుంచి వచ్చిన బల్లి క్రమంగా విండో వద్దకు వెళ్లి అటు నుంచి పైనున్న లగేజ్ క్యాబిన్లోకి వెళ్లిపోయిందని, దీని గురించి తాను క్యాబిన్ సిబ్బందికి వెంటనే ఫిర్యాదు చేసినా.. ఇది సర్వసాధారణ ఘటనలా వారు స్పందించి నవ్వుకోవడం తనను షాక్ గురిచేసిందని పేర్కొంది. విమానం దిగేవరకు బల్లి గురించి తాము ఏమీ చేయలేమని, కాబట్టి వేరే సీటులో కూర్చోవాలని సిబ్బంది చెప్పారని ఆమె వివరించింది. ఎక్కువ డబ్బు చెల్లించిమరీ తాను స్పైస్మాక్స్ సీటు కొనుగోలు చేశానని, కానీ వాస్తవానికి ఓ బల్లి పక్కన తాను కూర్చోవాల్సి వచ్చిందని, విమానంలోని పరిశుభ్రత ప్రమాణాలు తనను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయని చెప్పింది. అయితే, రూహి సింగ్ పోస్టుపై స్పందించడానికి స్పైస్‌జెట్ ఇప్పటివరకు ముందుకురాలేదు. @flyspicejet @spicejetairlines last night on flight SG 612 Chennai to Mumbai, I booked myself a spicemax seat (for which I paid extra money) to be seated next to a lizard! I'm extremely worried about your hygiene standards now, and the fact that the cabin crew laughed it off as if it's a common occurrence got me quite shocked. #Lizardonspicejet A post shared by Ruhi Singh (@ruhisingh12) on May 29, 2017 at 1:00am PDT -
భోజనంలో బల్లి!
ఎస్కేయూలో క్యాంటిన్లో ఘటన –ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు ఉద్యోగులు ఆసుపత్రిలో చేరిక –కామన్ మెస్‌కు తాళం వేసి ఆందోళన చేసిన విద్యార్థులు ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని కామన్మెస్లో ఆదివారం మధ్యాహ్నం భోజనంలో బల్లిపడి విషతుల్యం కావడంతో ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన అరగంటలోపే వాంతులు, వీరేచనాలు కావడంతో బాధితులను హుటాహుటీన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక విద్యార్థికి ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం చేస్తున్నారు. గ్రూప్–3 రాత పరీక్షతో తప్పిన ముప్పు కామన్ మెస్‌కు 1,070 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఆదివారం గ్రూప్–3 రాతపరీక్ష జరగడంతో కేవలం ఐదుగురు మాత్రమే మెస్‌కు హాజరయ్యారు. వీరితో పాటు సహపంక్తిలో భోజనం చేసిన ఇద్దరు ఉద్యోగులు (మెస్ వర్కర్లు) అస్వస్థకు లోనయ్యారు. దీంతో హరికృష్ణ యాదవ్, అనిల్ కుమార్ , గంగరాజు, మద్దయ్య, బాలముని (విద్యార్థులు), ఆంజినేయులు, అమర్నాథ్ (ఉద్యోగులు/వర్కర్లు) మొత్తం భోజనం చేసిన వారంతా అనారోగ్యం పాలయ్యారు. మెస్‌కు తాళం వేసి ఆందోళన : ఆహారం తిన్న విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో , అప్పటికే పరీక్ష రాసి వర్సిటీకి చేరుకున్న విద్యార్థులు కామన్మెస్కు తాళం వేసి ఆందోళన నిర్వహించారు. నాసిరకమైన ఆహారం అందించడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు ఆరోపించారు. పరామర్శ : అస్వస్థతకు గురైన విద్యార్థులను, ఉద్యోగులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామి రెడ్డి, పార్టీ నాయకులు చవ్వా రాజశేఖర్ రెడ్డి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఉన్నతాధికారులను సూచించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, నరేంద్ర రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, జయచంద్రా రెడ్డి, ఆకుల రాఘవేంద్ర రెడ్డి ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి జయపాల్ యాదవ్ తదితురులు కూడా బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అంతకుముందు చికిత్స తీసుకుంటున్న వారిని రిజిస్ట్రార్ ఆచార్య కే.సుధాకర్ బాబు, వార్డెన్ హుస్సేన్ రెడ్డి, ప్రిన్సిపాల్ సీఎన్ కృష్ణానాయక్ పరామర్శించారు. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్: ఆదివారం జరిగిన ఘటనలో బాధ్యులైన నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వీసీ ఆచార్య కే.రాజగోపాల్ ‘ సాక్షి’కి తెలిపారు. ఘటనకు బాధ్యులైన కె.ఉజ్జినయ్య, ఎం. జయప్ప, బి.నాగరాజు, కె.రామాంజినేయులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. వార్డెన్, డిప్యూటీ వార్డెన్ నివేదిక అనుగుణంగా ఉద్యోగులపై తక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరా వర్సిటీలో ఆదివారం వెలుగులోకి వచ్చిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎస్కేయూ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆదివారం సాయంత్రం ఓ లేఖ పంపారు. ఘటనపై సమగ్ర వివరాలు అందజేయాలని కోరారు. -
బీర్ బాటిల్లో బల్లి
-
వైవీయూలో పెల్లుబికిన ఆందోళన
► రెండు వారాల్లో రెండో ఘటన ► రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల ధర్నా ► చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో వరుస సంఘటనలు బెంబేలెత్తిస్తున్నాయి. గత నెల 20వ తేదీన ఆహారం కలుషితమై పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. ఈ ఘటన జరిగి 15 రోజులు గడవక ముందే తాజాగా ఆదివారం రాత్రి వైవీయూ హాస్టల్స్‌లో వండిన రసంలో 3 బల్లులు పడి చనిపోయాయి. అయితే ఇదే ఆహారాన్ని విద్యార్థులు తీసుకోవడంతో పలువురు అస్వస్తతకు గురయ్యారు. ఇలా రెండు వారాల్లో రెండు ఘటనలు చోటుచేసుకోవడం విద్యార్థులు కన్నెర్రజేశారు. చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు దిగుతామని అధికారులను హెచ్చరించారు. విశ్వవిద్యాలయంలో హాస్టల్, మెస్ నిర్వహణ సక్రమంగా లేదని చీఫ్ వార్డెన్ మొదలు వైస్ చాన్సలర్ వరకు అందరికీ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో అర్ధరాత్రి వేళ సైతం ఆందోళనకు దిగారు. అయినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో విద్యార్థుల ఓపిక నశించింది. సోమవారం యూనిరర్సిటీ ప్రధాన గేటు, హాస్టల్స్ గేట్ల ముందు భైఠాయించారు. అర్ధరాత్రి నుంచి ఆందోళనలో విద్యార్థులు..: ఆదివారం రాత్రి భోజన సమయంలో రసంలో మూడు బల్లులు చనిపోయి ఉండటంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. అప్పటికే భోజనం చేసిన కొందరు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో నీరసించి క్యాంపస్‌లోని ఆరోగ్యకేంద్రానికి చేరుకున్నారు. మరికొందరు భయంతో ముందస్తుగా మందులు వేసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై అశ్రద్ధగా వ్యవహరిస్తున్న హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు రాత్రి నుంచే ఆందోళనకు దిగారు. దీంతో సంఘటనా స్థలానికి హాస్టల్ చీఫ్ వార్డెన్ ఆచార్య గులాంతారీఖ్ వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. సంఘటనపై విచారణ చేపడతామని.. వైస్ చాన్సలర్ వచ్చిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. ఘటనపై కమిటీ ఏర్పాటు..?: ప్రస్తున ఘటనపై వంట సిబ్బందిని విచారించగా తాము రోజుమాదిరిగానే శుభ్రంగా వండి, భోజనం పూర్తయిన బయోమెట్రిక్‌లో నమోదు చేసి ఇంటికి వెళ్లామని చెప్పారు. అయితే ఆ తర్వాత బల్లులు పడ్డాయని విద్యార్థులు ఆందోళనకు దిగినట్లు చెప్పారు. ఘటనపై మంగళవారం విచారణ కమిటీ వేయనున్నట్లు సమాచారం. మళ్లీ ఘటనలు పునరావృతం కాకుండా భోజన నిర్వహణను అవుట్సోర్సింగ్ ఏజన్సీకి కేటాయించాలనే ఆలోచన అధికారుల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయింపు..: సోమవారం ఉదయం చనిపోయిన బల్లులు పడిన పాత్రలను శవయాత్రలా హాస్టల్స్ నుంచి వైవీయూ ప్రధానద్వారం వద్దకు తీసుకువచ్చి అక్కడ బైఠాయించి విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో పెండ్లిమర్రి ఎస్ఐ రోషన్ నేతృత్వంలో పోలీసుల బృందం అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అయినప్పటికీ వారు శాంతించారు. వీరికి జతగా లేడీస్ హాస్టల్ విద్యార్థినులు సైతం హాస్టల్ ద్వారం వద్ద బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. దీంతో వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి, చీఫ్ వార్డెన్ ఆచార్య గులాంతారీఖ్ తదితరులు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం పలువురు విద్యార్థి సంఘనాయకులు వైస్ చాన్సలర్‌ను కలిసి వినతిపత్రం అందజేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఇదేమిటి? అదేం ప్రశ్న..
ఇది పాము అని అంటారు.. తప్పు.. ఇది బల్లి అని మేమంటే.. అవును.. ఇది బల్లే.. కావలిస్తే.. దానికి బుల్లి కాళ్లు ఉన్నాయి చూడండి.. అసలు నెదర్లాండ్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ వాన్ బెర్జ్ దీని చిత్రాలు తీసేదాక.. ఇదొకటి ఇంకా బతికుందని శాస్త్రవేత్తలు కూడా అనుకోలేదట. బల్లి జాతికి చెందిన ఈ ‘వెస్ట్రన్ సెర్పెంటిఫార్మ్ లిజర్డ్’ను అంతరించిపోయిన జాతుల జాబితాలో ఎప్పుడో కలిపేశారట. వాన్ బెర్జ్ తీసిన ఈ ఫొటోను చూసి.. వాళ్లు నోరెళ్లబెట్టేశారు. దీని ఫొటో తీయడం కూడా ఇదే తొలిసారట. వాన్బెర్జ్ ఈ చిత్రాలను కెన్యాలోని మసాయి మారా రిజర్వు పార్కులో తీశారు. -
ఆంధ్రా వర్సిటీ హాస్టల్ భోజనంలో బల్లి
-
ఆంధ్రా వర్సిటీ హాస్టల్ భోజనంలో బల్లి
ఏయూ క్యాంపస్: విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని నాగార్జున హాస్టల్లో విద్యార్థులకు శుక్రవారం రాత్రి భోజనంలో బల్లి అవశేషం దర్శనమివ్వడం ఆందోళనకు దారి తీసింది. బల్లిని చూసిన విద్యార్థులు భోజనం మానేసి ఆందోళనకు దిగారు. అప్పటికే కొందరు విద్యార్థులు భోజనం ముగించగా... ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉండిపోయారు. విద్యార్థుల ఆందోళనతో చీఫ్ వార్డెన్ విశ్వనాథం హాస్టల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. అయితే, విద్యార్థులు ఎవరికీ ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
బల్లి పడ్డ భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత
చిత్తూరు (అర్బన్) : బల్లిపడ్డ ఆహారం తినడంతో 15 మందివిద్యార్థులు గురువారంఅస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన చిత్తూరు నగరంలోని కస్తూర్భా నగర పాలక బాలికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. నగరంలోని ఖాజీ కార్పొరేషన్ పాఠశాల నుంచి మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి ఇక్కడి విద్యార్థులకు వడ్డిస్తారు. ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యాహ్నం కూడా విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఆ భోజనర తిన్న కొంతసేపటికి ఐదుగురు విద్యార్థులకు వాంతులయ్యాయి. తరువాత మరికొంత మంది వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తర్వాత భోజనంలో బల్లిపడ్డట్టు గుర్తించారు. భోజనం పెట్టే సమయంలో ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలలో లేరు. ఉపాధ్యాయులు ఆమెకు సమాచారం ఇచ్చారు. ఆమె ఇంటి నుంచి పాఠశాలకు వచ్చేంతవరకు పిల్లలకు ప్రథమ చికిత్స కూడా అందించకుండా పాఠశాలలోనే ఉంచేశారు. తరువాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విద్యార్థులు కోలుకున్న తరువాత పాఠశాలకు తీసుకొచ్చారు. -
భోజనంలో బల్లి... అబ్బే అలాంటిదేమీ లేదు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి వివాదంలో ఇరుక్కుంది. సిబ్బంది ఇచ్చిన మధ్యాహ్న భోజనం ప్లేట్లో బల్లి దర్శనమివ్వడంతో వివాదం రేగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ నుండి గురువారం లండన్‌కు బయలుదేరిన ఎఐ 111 విమానంలో ఓ ప్రయాణికుడు తనకిచ్చిన భోజనంలో బల్లి కనిపించడంతో షాకయ్యాడు. విమానం టేక్ ఆఫ్ అవగానే తనకు ఇచ్చిన ఆహారపు ట్రేలో బల్లి కనిపించగానే షాకయ్యాననీ,... ప్లేట్ మార్చి ...వేరేది ఇమ్మంటే సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని ఆ ప్రయాణికుడు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై ఎయిర్ ఇండియాకు తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఆ ఆరోపణలను ఎయిర్ ఇండియా ఖండించింది. ఆహారంలో బల్లి ఉండటం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ప్రయాణికుడి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతోంది. -
పలమనేరులో రెండు తోకల బల్లి
మామూలుగా బల్లికి ఓ తోక ఉండడం తెలిసిందే. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో సోమవారం రెండు తోకల బల్లి కనిపించింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల ఓ పండ్ల దుకాణంలో ఈ బల్లి దుకాణ యజమానికి కనిపించింది. ఇది విచిత్రంగా ఉండడంతో దీన్ని చూసేందుకు బస్టాండ్‌లోని జనం ఆసక్తిగా చూశారు. జన్యుపరమైన లోపాలతోనే ఇటువంటివి అరుదుగా పుడుతుంటాయని పలమనేరు పశువైద్యాధికారి డాక్టర్ సుజాత తెలిపారు. - పలమనేరు -
బల్లిని ప్రసవించిందట!
-
అన్నంలో బల్లి
నలుగురు ‘సంక్షేమ’ విద్యార్థులకు అస్వస్థత హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో బల్లి పడిన ఆహారం తిన్న నలుగురు విద్యార్థులు శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని చంపాపేట డివిజన్ రెడ్డికాలనీలోని వికలాంగుల ప్రభుత్వ బాలుర వసతిగృహంలో సిబ్బంది శనివారం రాత్రి విద్యార్థుల కోసం అన్నం, పప్పు, చామగడ్డ కూర వండారు. అయితే, విద్యార్థులు భోజనం చేసే సమయంలో షఫీయుద్దీన్ అనే పీజీ విద్యార్థికి అన్నంలో ఉడికిన బల్లి చేతికి తగిలింది. పరిశీలించి అది బల్లిగా నిర్ధారించుకున్నాడు. హస్టల్లోని 195 మంది విద్యార్థులకు గాను, అప్పటికే 78 మంది విద్యార్థులు భోజనం చేశారు. వీరిలో సురేష్, మశ్చేందర్, గుణశేఖర్లూ వాంతులు చేసుకున్నారు. తోటి విద్యార్థులు వెంటనే వారిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న సంక్షేమ శాఖ ఏడీ వెంకట్‌రెడ్డి, సూపరింటెండెంట్ హుటాహుటినా హాస్టల్‌కు వచ్చి అస్వస్థతకు గురైన విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ఆ సమయంలో వార్డెన్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బల్లి.. తల్లి..
కాన్పు ఏ మహిళకైనా పునర్జన్మే.. చిత్రంలోని ఇండోనేషియా మహిళ డెబీ(బెడ్‌పై ఉన్న ఆమె)కి కూడా.. అయితే, ఈమె నవమాసాలు మోసి.. జన్మనిచ్చింది బుల్లి పిల్లకు కాదు.. బల్లికి!! అవును. ఈ బల్లికి తల్లిని తానేనని డెబీ చెబుతోంది. తాను ఇన్ని నెలలు కడుపులో మోసింది ఈ బల్లినేనని గట్టిగా వాదిస్తోంది కూడా. మనమైతే.. ఇదంతా బోగస్ అని.. పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తాం. అయితే.. ఇండోనేషియా అధికారులు మాత్రం అలా కొట్టిపారేయలేదు. ఇది నిజమా కాదా అని తేల్చడానికి ఓ ప్రత్యేక బృందాన్ని నియమించారు. ప్రస్తుతం ఆ బృందం దర్యాప్తు చురుగ్గా సాగుతోంది కూడా.. ఇంతకీ ఈ బల్లి తల్లి కథ ఏమిటంటే.. డెబీ గర్భవతి. ఆ విషయాన్ని డెబీ ఉండే ఓనంటో గ్రామస్తులు కూడా నిర్ధారిస్తున్నారు. మే 30న ఆమెకు నొప్పులు వచ్చాయి. ఆస్పత్రి చాలా దూరం కావడంతో ఇంటి పక్కనున్న మహిళ జోసెఫెన్(బల్లిని చూపిస్తున్న మహిళ)ను కాన్పు కోసం సాయం కోరింది. ప్రసవం సమయంలో జోసెఫెన్ డెబీ ఇంట్లోనే ఉంది. ఆమె కూడా చిన్నారి కాకుండా చిన్న బల్లి వచ్చిందనే చెబుతోంది. ఏదో తేడా జరిగిందని గ్రహించి.. జోసెఫెన్ ఆ బల్లి పిల్లను, తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లింది కూడా.. డెబీ వాదనను జోసెఫెన్ కూడా సమర్థిస్తుండంతో అధికారులు డైలమాలో పడ్డారు. ప్రసవం సమయంలో అక్కడ బల్లి ఉండిఉండవచ్చని అంటున్నారు. డెబీ, జోసెఫెన్ వాదనంతా అబద్ధమని చెబుతునే.. నిజం కనుక్కునే పనిలో పడ్డారు. అటు గ్రామస్తులు మాత్రం డెబీ చేతబడిలాంటివి చేస్తోందని.. అందుకే ఇలా జరిగిందని ఆమెపై ఫైర్ అవుతున్నారు. -
బల్లిగారి అరుపులకు... అర్థాలే వేరా!
నమ్మకం ఇంటి గోడల మీద జరజరా పాకే బల్లిని చూస్తే చాలామంది కెవ్వుమంటారు. పిల్లలయితే, బల్లి ఉంది అంటే చాలు... భీతితో బువ్వ తినేస్తారు. కానీ అలా భయపడేంత ప్రమాదకరమైనది కాదు బల్లి. చిన్న చిన్న పురుగులను పట్టి తింటుందే తప్ప, మనిషికి హాని చేసేంత శక్తి లేదు దానికి. కానీ బల్లి అనగానే భయమెందుకు? బల్లి చుట్టూ మనిషికి ఉన్న నమ్మకాలు ఏంటి? అవి నమ్మకాలా... మూఢనమ్మకాలా? బల్లి గురించి భారతదేశంలో ఉన్నన్ని నమ్మకాలు, మరే ఇతర దేశంలోనూ లేవు. కొన్ని దేశాల్లో అది మామూలు సరీసృపం. దానిని లెక్కే చేయరు. కానీ మన దేశంలో మాత్రం బల్లి చుట్టూ బలమైన నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలకు ఆధారాలు గౌలి శాస్త్రంలో ఉన్నాయి. బల్లి వల్ల కలిగే లాభాలేమిటి, బల్లి ద్వారా చుట్టుముట్టే నష్టాలేమిటి అన్నదాన్ని చాలామంది విడమర్చి వివరిస్తూ ఉంటారు. బల్లి కిందపడటం గురించి ఎన్నో విషయాలు నమ్మకంగా చెబుతుంటారు. గురు శుక్రవారాలు తప్ప మిగిలిన ఏ రోజులో బల్లి గోడ మీది నుంచి కింద పడినా మంచి జరుగుతుందట. ఆదివారం పడితే ధనలాభమని, సోమవారం పడితే నూతన వస్తు లాభాలు కలుగుతాయని... ఇలా రకరకాల నమ్మకాలున్నాయి. బల్లి మనిషి మీద పడటం గురించి కూడా ఎన్నో వాదనలు, నమ్మకాలు ఉన్నాయి. బల్లి ఒక పురుషుడి నడినెత్తి మీద పడితే మరణం సంభవిస్తుందని ఎంతోమంది నమ్ముతారు. ముఖమ్మీద పడితే సంపద చేకూరుతుంది. గడ్డం మీద పడితే అవరోధాలు ఎదురవుతాయి. పాదం మీద పడితే అనారోగ్యం కలుగుతుంది. అదే స్త్రీలలో అయితే... బల్లి వారి చేతి మీద పడితే ఆర్థిక సమస్యలు వస్తాయి. భుజమ్మీద పడితే ఆభరణాలు దక్కుతాయి. వీపు మీద పడితే మరణం సంభవిస్తుంది. ఛాతి మీద పడితే అశాంతి కలుగుతుంది. ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. కేవలం మీద పడటం గురించే కాదు, బల్లి అరుపు గురించి కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. ఆడవారి మాటలకు అర్థాలు వేరన్నట్టు, బల్లి శబ్దాలకు కూడా చాలా అర్థాలున్నాయి. తూర్పు వైపున బల్లి శబ్దం చేస్తే అశుభం జరుగుతుందట. ఆగ్నేయం వైపు నుండి బల్లి అరిస్తే... కలహాలు, తగాదాలు ఏర్పడతాయట. దక్షిణ దిశలో శబ్దం చేస్తే శుభకార్యాలు జరుగుతాయని, బోలెడంత అదృష్టం కూడా వరిస్తుందని అంటారు. ఒకవేళ మన ఇంటికి దక్షిణం వైపున ఉన్న మరో ఇంటి మీద ఉండి బల్లి శబ్దం చేస్తే... విచారకమైన వార్తలు అందుతాయట. ఇలాంటి నమ్మకాలన్నీ కలిసి బల్లిని మనిషికి శత్రువుని చేశాయని చెప్పాలి. అందుకే దాన్ని విలన్ చేసి మాట్లాడుతున్నాం. బల్లిని బూచిని చేసి పిల్లల్ని భయపెడుతున్నాం. అయితే నిజానికి బల్లి వల్ల చెడు జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పినదానికి వేరే కారణం ఉందని అంటున్నారు పండితులు. అప్పట్లో ముంగిస జాతికి చెందిన ఒక రకమైన బల్లులు ఉండేవట. అవి ఒకలాంటి విషద్రవాన్ని తమ నోటితో వెదజల్లేవట. ఆ ద్రవం కంటిలో పడితే చూపు పోయేది. ఒంటి మీద పడితే ఒళ్లంతా నల్లటి మచ్చలు వచ్చేసేవి. నాలుకమీద పడితే మాట లేకుండా పోయేది. ఆ బల్లులను దృష్టిలో పెట్టుకుని, అది ఏ అవయవంపై పడితే ఏమవుతుందో చెబుతూ శాస్త్రాలు పంచాగాలు రాశారట. అవన్నీ ఆరోగ్య జాగ్రత్తల కోసం రాసినవే తప్ప, బల్లికి ఒక మనిషి భవిష్యత్తును నిర్దేశించే శక్తి లేదని, అవన్నీ మనిషి తనకు తాను ఏర్పరచుకున్న నమ్మకాలనీ అంటున్నారు. ఆరోగ్యపరంగా శాస్త్రాల్లో చెప్పిన జాగ్రత్తలను రకరకాలుగా అర్థ చేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ పుట్టుకొచ్చాయన్న మాట. లోతుగా ఆలోచిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అయినా ఒక చిన్ని జీవికి ఇన్ని శక్తులు ఉంటే, ఇంకా ఎన్నో జంతువులు ఉన్నాయి కదా, వాటికి కూడా ఏవో శక్తులు ఉండాలిగా! ఇలా ఆలోచిస్తేనయినా ఎన్నో యేళ్లుగా బల్లి గురించి ఉన్న అపోహలు తొలగిపోతా యంటారా! థాయ్‌ల్యాండ్ వారికి కూడా బల్లి గురించిన ఓ భయంకర నమ్మకం ఉంది. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు బల్లిజారి కాళ్ల ముందు గానీ పడితే, వాళ్లు ఇక ఇల్లు కదలరు. ఒకవేళ వెళితే... రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని, లేదంటే మరి ఏదో ఒకరకంగానైనా మృత్యువు వెతుక్కుంటూ వస్తుందని భయపడతారు.