బల్లికి ఆహారంగా పురుగు, ఎలా అందించారనేదే మేటర్‌!

Lizard Grabs Worm off zoo owner’s lip Vdieo wil be Vairal - Sakshi

బల్లిని చూస్తేనే చాలా మందికి విపరీతమైన భయం. అదెక్కడో గోడ మీద కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెత్తేవారు ఉంటారు. అలాంటిది బల్లి  మీద పడితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చదవబోయే న్యూస్‌లో అంతకు మించిన మ్యాటర్‌ ఉంది. ఇక్కడ బల్లి దాని యజమాని పెదవుల మీద ఉన్న పురుగును అమాంతం నోట్లో వేసుకుంది. యాక్‌ అనిపించినా ఇది వాస్తవం.

ఆ వివరాలు.. సరీసృపాల జూ వ్యవస్థాపకుడు జే బ్రూవర్ తన జూలోని జంతులాలతో ఎంతో ప్రేమగా ఉంటారు. వాటిని స్వయంగా ఆహారం అందించి మురిసిపోతుంటాడు. తాజాగా ఆయన ఓ పెద్ద బల్లికి పురుగుని ఆహారంగా అందించాడు. మాములుగా ఇస్తే.. ఓకే! కానీ అతను తన పెదవులపై ఆ పురుగును ఉంచుకోగా.. బల్లి వేగంగా దాన్ని తన పొడవాటి నాలుకతో నోట కరుచుకుంది. అందుకనే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటివెన్నో జే బ్రూవర్ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటారు. 

(చదవండి: ఇది నిజంగా ముంబైలో జరిగిందా?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top