
భోజనంలో బల్లి... అబ్బే అలాంటిదేమీ లేదు..
గురువారం లండన్కు బయలుదేరిన ఎఐ 111 విమానంలో ప్రయాణికుడు తనకిచ్చిన భోజనంలో బల్లి కనిపించడంతో షాకయ్యాడు. సిబ్బంది ఇచ్చిన మధ్యాహ్న భోజనం ప్లేట్లో బల్లి దర్శన మివ్వడంతో వివాదం రేగింది.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి వివాదంలో ఇరుక్కుంది. సిబ్బంది ఇచ్చిన మధ్యాహ్న భోజనం ప్లేట్లో బల్లి దర్శనమివ్వడంతో వివాదం రేగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ నుండి గురువారం లండన్కు బయలుదేరిన ఎఐ 111 విమానంలో ఓ ప్రయాణికుడు తనకిచ్చిన భోజనంలో బల్లి కనిపించడంతో షాకయ్యాడు.
విమానం టేక్ ఆఫ్ అవగానే తనకు ఇచ్చిన ఆహారపు ట్రేలో బల్లి కనిపించగానే షాకయ్యాననీ,... ప్లేట్ మార్చి ...వేరేది ఇమ్మంటే సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని ఆ ప్రయాణికుడు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై ఎయిర్ ఇండియాకు తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఆ ఆరోపణలను ఎయిర్ ఇండియా ఖండించింది. ఆహారంలో బల్లి ఉండటం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ప్రయాణికుడి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతోంది.