ఆంధ్రా వర్సిటీ హాస్టల్ భోజనంలో బల్లి | students protests after lizard found in andra university hostel food | Sakshi
Sakshi News home page

ఆంధ్రా వర్సిటీ హాస్టల్ భోజనంలో బల్లి

Sep 4 2015 10:40 PM | Updated on Sep 3 2017 8:44 AM

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని నాగార్జున హాస్టల్లో విద్యార్థులకు శుక్రవారం రాత్రి భోజనంలో బల్లి అవశేషం దర్శనమివ్వడం ఆందోళనకు దారి తీసింది.

ఏయూ క్యాంపస్: విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని నాగార్జున హాస్టల్లో విద్యార్థులకు శుక్రవారం రాత్రి భోజనంలో బల్లి అవశేషం దర్శనమివ్వడం ఆందోళనకు దారి తీసింది. బల్లిని చూసిన విద్యార్థులు భోజనం మానేసి ఆందోళనకు దిగారు. అప్పటికే కొందరు విద్యార్థులు భోజనం ముగించగా... ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉండిపోయారు.

విద్యార్థుల ఆందోళనతో చీఫ్ వార్డెన్ విశ్వనాథం హాస్టల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. అయితే, విద్యార్థులు ఎవరికీ ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement