జూమ్ చేసినా బ‌ల్లి క‌నిపించ‌ట్లేదు.. | Sakshi
Sakshi News home page

వైర‌ల్ ఫొటో: బ‌ల్లి క‌నిపించిందా?

Published Sun, Jul 5 2020 2:42 PM

Find The Lizard On Tree In This Picture - Sakshi

క‌రోనా వార్త‌ల‌తో మీ బుర్ర వేడెక్కిందా.. గుండెకు గుబులు పుట్టించే వార్త‌లు చ‌దివీ మన‌సు ఆందోళ‌న‌గా మారుతోందా? అందుకే మీకోసం ఈ ప‌జిల్‌. మీ టెన్ష‌న్‌ల‌న్నీ ప‌క్క‌న‌పెట్టి స‌ర‌దాగా ఈ పజిల్ను ఓ ప‌ట్టు ప‌ట్టేయండి. మెద‌డుకు మేత‌తోపాటు, మ‌న‌సుకు కాస్త స్వాంత‌న చేకూరుతుంది. ఇంత‌కీ పైన క‌నిపిస్తున్న ఫొటోలో ఏముంది.. రోడ్డు.. ఆ ప‌క్క‌న చెట్టు వేర్లు, లేదా కాండం. దాని ప‌క్క‌నే ఎండిన మొక్క‌ల పొద కూడా ఉంది. వీటితోపాటు ఓ జీవి కూడా ఉందండోయ్‌.. ఇందులో చాలామందికి పేరు త‌లుచుకుంటేనే జ‌ల‌ద‌రించే బ‌ల్లి కూడా ఉంది. (బంగారు బల్లి.. మళ్లీ దర్శనం)

ఇంకేం.. భూత‌ద్దం ప‌ట్టుకుని వెతికేయండి మ‌రి.. ఇప్ప‌టికే చాలామంది వెతికి వెతికి అలిసిపోతున్నారే త‌ప్ప దాన్ని మాత్రం గుర్తించ‌లేక‌పోతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం "బ‌ల్లి ప్రాణం మా చావుకొచ్చింది.." అంటూ కామెంట్లు చేస్తున్నారు. "ఎంత జూమ్ చేసినా క‌నిపించ‌ట్లేదురా బాబోయ్" అంటూ చేతులెత్తేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రం "హేయ్‌.. దొరికేసిందోచ్‌.." అంటూ ఎగిరి గంతేస్తున్నారు. ఇంత‌కీ మీరు కూడా క‌ళ్లు పెద్ద‌వి చేసి తెగ వెతికేస్తున్న‌ట్లున్నారు. ఇప్ప‌టికీ దాని జాడ గుర్తించ‌క‌పోతే శ్ర‌మించ‌డం మాని ఈ ఫొటో చూసేయండి. (ఉడుము బిర్యానీ అదరహో!)

Advertisement
 
Advertisement
 
Advertisement