బల్లి నోట్లో నోరు పెట్టాడు.. | Sakshi
Sakshi News home page

‘ఇదేందిదీ.. ఇది నేను చూడలా’

Published Wed, Feb 19 2020 11:59 AM

Australian Man Gives Mouth To Mouth To Save Lizard - Sakshi

కాన్‌బెర్రా: ‘ఇదేందిది.. ఓరీ నీయమ్మ భడవా.. ఇది నేను చూడలా’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. అసలు విషయం చెప్తే మీరు కూడా ఇదే మాటంటారు కాబోలు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి స్థానిక బార్‌కు వెళ్లి బీర్‌ ఆర్డర్‌ చేశాడు. సిబ్బంది అతనికి గ్లాసులో బీరును అందించారు. ఇక తాగడం మొదలెడదాం అనుకున్న అతనికి గ్లాసులో బల్లి కనిపించింది. సాధారణంగా ఎవరైనా సరే ఈ విషయానికి కోపగించుకుని వెంటనే బార్‌ సిబ్బందితో గొడవకు దిగి రచ్చరచ్చ చేస్తాం. కానీ ఆ వ్యక్తి అలా చేయలేదు. పైపెచ్చు.. బార్‌ సిబ్బంది తనతో తమాషాలాడుతున్నాడనుకున్నాడు. తనను ప్రాంక్‌ చేసేందుకు కావాలనే ఆ ప్రాణిని బీర్‌లో వేశారని భావించాడు.(బిర్యానీలో చచ్చిన బల్లులను కలుపుతూ..)

దీనిపై స్పందించిన సిబ్బంది అనుకోకుండా పడిందని పేర్కొనడంతో అతను వెంటనే దాన్ని గ్లాసులో నుంచి సునాయాసంగా బయటకు తీశాడు. పాపం.. బీర్‌లో మునిగిన దానికి ఊపిరాడుతుందో లేదోనని పరీక్షించాడు. అనుమానం వచ్చిన అతను వెంటనే దాన్ని రక్షించేందుకు సిద్ధమయ్యాడు. మరో ఆలోచనే లేకుండా బల్లి నోటిలో నోరు పెట్టి దానికి శ్వాసనందించి ప్రాణం పోశాడు.  వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీనికి నెటిజన్లు ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో ఆ ప్రాణిని కాపాడినందుకు మెచ్చుకుంటుంటే మరికొందరేమో అతడు చేసిన పనికి మాకు దిమ్మతిరిగిపోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. (కదలకుండా అదే స్థానంలో ఏడేళ్లు ఎలా?)

Advertisement
 
Advertisement
 
Advertisement