ఎత్తి కొడితే.. ఎగిరి పడింది..

Buffalo Attacks On Lions Mob To Save A Lizard In Kruger National Park - Sakshi

దక్షిణాఫ్రికా: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వం అనిపించుకుంటుంది. కానీ నేటి కాలంలో మానవత్వం మాట దేవుడెరుగు..! కనీసం ఇతరులకు కీడు తలపెట్టకుండా ఉంటే చాలు. ఈ విషయంలో పశుపక్ష్యాదులు మినహాయింపు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అవి స్పందిస్తాయి. సహాయం కోసం అర్థిస్తున్న వాళ్లకు చేయూతనందిస్తాయి.

తక్షణం స్పందించి వాటికి తోచిన రీతిలో ఇతర మూగ జీవాలకు తోడుగా నిలుస్తాయి. సింహాల బారిన పడి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న ఓ భారీ సైజు బల్లిని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ గేదె కాపాడింది. తుపాను వేగంతో అక్కడికి చేరుకుని ఆ సింహాల గుంపుని చెండాడింది. ఈ సంఘటన క్రూగర్‌ జాతీయ పార్కులో ఇటీవల చోటుచేసుకుంది.

సింహాల గుంపు ఆ బల్లిని పీక్కు తినేందుకు సిద్ధమౌతున్న వేళ ఆ గేదె చాకచక్యంగా దాన్ని రక్షించింది. క్షణం ఆలస్యమైనా ఆ బల్లి ప్రాణాలు హరీమనేవే. అందుకనే కోపం పట్టలేని గేదె ఒక్క ఉదుటున బల్లిని తన కాలికింద తొక్కిపట్టిన సింహం మీదకి దుమికింది. అపాయం నుంచి బల్లి బయటపడగానే తన రెండు కొమ్ములతో ఆ సింహాన్ని ఎత్తి కొట్టింది.

గాల్లో గింగిరాలు తిరుగుతూ కింద పడిన ఆ సింహం  కుయ్యో, ముర్రో అంటూ అక్కడ్నుంచి జారుకోగా, మిగతా సింహాలు కూడా దాన్ని అనుసరించాయి. పార్కుని సందర్శిస్తున్న స్యూన్‌ ఎలోఫ్‌ అనే వ్యక్తి ఈ సాహస కృత్యాన్ని తన కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top