విమానం సీటు కింద బల్లి.. షాక్‌ తిన్న హీరోయిన్‌! | When Calender Girls actor Ruhi Singh found a lizard under her seat in SpiceJet flight | Sakshi
Sakshi News home page

విమానం సీటు కింద బల్లి.. షాక్‌ తిన్న హీరోయిన్‌!

May 30 2017 11:48 AM | Updated on Sep 5 2017 12:22 PM

విమానం సీటు కింద బల్లి.. షాక్‌ తిన్న హీరోయిన్‌!

విమానం సీటు కింద బల్లి.. షాక్‌ తిన్న హీరోయిన్‌!

ఖరీదైన విమానంలో సీటు కింద నుంచి ఓ బల్లి వచ్చి తచ్చాడితే ఎలా ఉంటుంది.

ఖరీదైన విమానంలో సీటు కింద నుంచి ఓ బల్లి వచ్చి తచ్చాడితే ఎలా ఉంటుంది. ఎవరికైనా ఒకింత వికారంగా, షాకింగ్‌గా ఉంటుంది. ఇలాంటి చేదు అనుభవమే వర్ధమాన నటి రూహి సింగ్‌కు ఎదురైంది. మధుర్‌ బండార్కర్‌ ‘క్యాలండర్‌ గర్ల్స్‌’  సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. తమిళ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో గడిపిన ఆమె స్పైస్‌జెట్‌ విమానంలో ముంబై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో మండిపడిన ఈ మాజీ మిస్‌ ఇండియా.. విమానాల్లో ఇంత దారుణమైన అపరిశ్రుభత ఎలా ఉంటుందంటూ విమానంలో బల్లి తచ్చాడుతున్న వీడియను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

స్పైస్‌జెట్‌ విమానంలో అధిక ధర చెల్లించి తాను ప్రీమియం టికెట్‌ను కొన్నానని, తీరికలేని షెడ్యూల్‌ నుంచి విశ్రాంతి తీసుకోవడానికి తాను ఈ టికెట్‌ కొంటే.. అందుకు భిన్నంగా తాను ఓ బల్లితో కలిసి ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె తన పోస్టులో వాపోయింది. తన సీటు కింద నుంచి వచ్చిన బల్లి క్రమంగా విండో వద్దకు వెళ్లి అటు నుంచి పైనున్న లగేజ్‌ క్యాబిన్‌లోకి వెళ్లిపోయిందని, దీని గురించి తాను క్యాబిన్‌ సిబ్బందికి వెంటనే ఫిర్యాదు చేసినా.. ఇది సర్వసాధారణ ఘటనలా వారు స్పందించి నవ్వుకోవడం తనను షాక్‌ గురిచేసిందని పేర్కొంది. 

విమానం దిగేవరకు బల్లి గురించి తాము ఏమీ చేయలేమని, కాబట్టి వేరే సీటులో కూర్చోవాలని సిబ్బంది చెప్పారని ఆమె వివరించింది. ఎక్కువ డబ్బు చెల్లించిమరీ తాను స్పైస్‌మాక్స్‌ సీటు కొనుగోలు చేశానని, కానీ వాస్తవానికి ఓ బల్లి పక్కన తాను కూర్చోవాల్సి వచ్చిందని, విమానంలోని పరిశుభ్రత ప్రమాణాలు తనను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయని చెప్పింది. అయితే, రూహి సింగ్‌ పోస్టుపై స్పందించడానికి స్పైస్‌జెట్‌ ఇప్పటివరకు ముందుకురాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement