ఇదేమిటి? అదేం ప్రశ్న.. | What is this? snake or lizard? | Sakshi
Sakshi News home page

ఇదేమిటి? అదేం ప్రశ్న..

Sep 16 2015 8:23 AM | Updated on Sep 3 2019 8:43 PM

ఇదేమిటి? అదేం ప్రశ్న.. - Sakshi

ఇదేమిటి? అదేం ప్రశ్న..

ఇది పాము అని అంటారు.. తప్పు.. ఇది బల్లి అని మేమంటే.. అవును.. ఇది బల్లే.. కావలిస్తే.. దానికి బుల్లి కాళ్లు ఉన్నాయి చూడండి..

ఇది పాము అని అంటారు.. తప్పు.. ఇది బల్లి అని మేమంటే.. అవును.. ఇది బల్లే.. కావలిస్తే.. దానికి బుల్లి కాళ్లు ఉన్నాయి చూడండి.. అసలు నెదర్లాండ్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ వాన్ బెర్జ్ దీని చిత్రాలు తీసేదాక.. ఇదొకటి ఇంకా బతికుందని శాస్త్రవేత్తలు కూడా అనుకోలేదట. బల్లి జాతికి చెందిన ఈ ‘వెస్ట్రన్ సెర్పెంటిఫార్మ్ లిజర్డ్’ను అంతరించిపోయిన జాతుల జాబితాలో ఎప్పుడో కలిపేశారట. వాన్ బెర్జ్ తీసిన ఈ ఫొటోను చూసి.. వాళ్లు నోరెళ్లబెట్టేశారు. దీని ఫొటో తీయడం కూడా ఇదే తొలిసారట. వాన్‌బెర్జ్ ఈ చిత్రాలను కెన్యాలోని మసాయి మారా రిజర్వు పార్కులో తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement