నెల్లూరు జిల్లాలో భూ వివాదం : ముగ్గురి మృతి | Land disputes in nellore three died | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో భూ వివాదం : ముగ్గురి మృతి

Oct 21 2016 4:25 PM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లాలో తలెత్తిన ఓ భూ వివాదంలో ముగ్గురు మృతి చెందారు.

కలిగిరి : నెల్లూరు జిల్లాలో తలెత్తిన ఓ భూ వివాదంలో ముగ్గురు మృతి చెందారు. కలిగిరి మండలం పాపనముసిలిపాలెంలో పొలం కొనుగోలు విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పొలాన్ని తామే సాగుచేసుకుంటున్నామంటూ శ్రీనివాసులురెడ్డి, గణేశం వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు పొలం కొనడానికి వచ్చిన వారిపై కళ్లలో కారం చల్లి దాడి చేశారు. ఈ గొడవలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
మృతులను నెల్లూరుకు చెందిన తానం సుబ్బారెడ్డి, తానం మహేందర్ రెడ్డి, కొండ్రెడ్డి సుబ్బారెడ్డిగా గుర్తించారు. నిందితులు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. గత కొంతకాలంగా వీరి మధ్య తీవ్రస్థాయిలో భూ వివాదాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement