‘కిస్ ఆఫ్ లవ్’ వాయిదా! | 'Kiss of Love' postponed! | Sakshi
Sakshi News home page

‘కిస్ ఆఫ్ లవ్’ వాయిదా!

Nov 30 2014 2:04 AM | Updated on Sep 2 2017 5:21 PM

‘కిస్ ఆఫ్ లవ్’ వాయిదా!

‘కిస్ ఆఫ్ లవ్’ వాయిదా!

వివాదాస్పద ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం వాయిదా పడనుంది.

బెంగళూరు:  వివాదాస్పద ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం వాయిదా పడనుంది. మోరల్ పోలీస్‌గిరికి వ్యతిరేకంగా ఆదివారం బెంగళూరులోని టౌన్‌హాల్ వద్ద కొంతమంది యువత నిర్వహించదలిచిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు అనుమతి ఇచ్చేది లేదని నగర పోలీసులు తేల్చిచెప్పిన నేపథ్యంలో నిర్వాహకుల్లో ఇద్దరు శనివారం సాయంత్రం కమిషనర్ ఎం.ఎన్‌రెడ్డిని నేరుగా కలుసుకుని కార్యక్రమానికి అనుమతించాల్సిందిగా కోరారు. కార్యక్రమం వల్ల శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలగదని వారు తెలిపారు. పరిశీలించి అనుమతి ఇచ్చే విషయం ఆలోచిస్తామని కమిషనర్ వారికి తెలిపారు. దీంతో ఆదివారం జరగాల్సిన కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం.   
 

Advertisement
 
Advertisement
Advertisement