చీకటిరాజ్యంలో లిప్‌లాక్‌లు | Kamal Haasan has lip lock with Trisha at Cheekati Rajyam | Sakshi
Sakshi News home page

చీకటిరాజ్యంలో లిప్‌లాక్‌లు

May 27 2015 2:36 AM | Updated on Sep 3 2017 2:44 AM

చీకటిరాజ్యంలో లిప్‌లాక్‌లు

చీకటిరాజ్యంలో లిప్‌లాక్‌లు

'చీకటి రాజ్యం' చుంభనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కమల్ తాజా చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యింది.

'చీకటి రాజ్యం' చుంభనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కమల్ తాజా చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యింది. లిప్‌లాక్ దృశ్యాలు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. అలాంటి సన్నివేశాలను తప్పుపట్టే స్థాయి దాటిపోయింది.

 హీరోయిన్లు కూడా లిప్‌లాక్ దృశ్యాల్లో నటిస్తే తప్పేమిటి? అని ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. ఇంతకు ముందు చుంభనాల దృశ్యాలకు తాను దూరం అన్న హీరోయిన్లు ఇప్పుడు కథ డిమాండ్ చేయడంతో కాదనలేకపోయానని అయినా ఆ సన్నివేశంలో అసభ్యం లేకుండా దర్శకుడు కళాత్మకంగా చిత్రీకరించారని చెబుతున్న కాలం ఇది.
 
 కోలీవుడ్‌లో  ఇలాంటి లిప్‌లాక్ దృశ్యాలకు అగ్‌మార్క్ హీరో కమలహాసన్ అంటారు. ఆయన ప్రతి చిత్రంలోను ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. ఈ విశ్వనాయకుడి చుంభనాల దృశ్యాలు చాలా ఘాటుగా ఉంటాయని అంటారు. తన తాజా ద్విభాషా చిత్రం తెలుగులో  'చీకటి రాజ్యం' తమిళంలో 'తూంగావనం' సినిమాలో ఇలాంటి చుంభన దృశ్యాల మోతాదు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమాన్ని ఇటీవల హైదరాబాదులో నిర్వహించారు.
 
ఈ సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో కమలహాసన్ నటి త్రిషను ఘాటుగా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం ఉంది. సాధారణంగా కమల్ చిత్రాలు వివాదాలకు నిలయం అనే పేరుంది. ఇటీవల ఆయన నటించిన ప్రతి చిత్రం తీవ్ర వ్యతిరేకతల మధ్య విడుదలైంది. ఈ తాజా చిత్రంలో చుంభనాల దృశ్యం ఎలాంటి వివాదాలకు తావు తీయనున్నాయో నంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement