
ప్రేమ కథా చిత్రంగా కలైవేందన్
ఈ ఆధునిక కాలంలో ఏదో ఒక కొత్తదనం లేకపోతే సినిమాలు ఆడే పరిస్థితి లేదు.అలా ఒక కొత్త విలు విద్యతో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న చిత్రం కలైవేందన్.
ఈ ఆధునిక కాలంలో ఏదో ఒక కొత్తదనం లేకపోతే సినిమాలు ఆడే పరిస్థితి లేదు.అలా ఒక కొత్త విలు విద్యతో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న చిత్రం కలైవేందన్. అజయ్, సనమ్‌శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌కేపీఎస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మాత కమల్‌కన్నన్ నిర్మిస్తున్నారు. కళాభవన్‌మణి, అనూమీనన్, కాదల్‌సుకుమార్, ఆర్తి, యువరాణి, సాధన ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని ఆర్‌కే పరశురామ్ నిర్వహిస్తున్నారు. చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ కరాటే, జూడో తర హాలో వియత్నాం దేశంలో ప్రాచుర్యం పొందిన ఒలినాం అనే ఆత్మరక్షణ విలువిద్యలో శిక్షకుడైన హీరో హీరోయిన్‌కు మధ్య ప్రేమకు సమస్యలు ఎదురవుతాయన్నారు. ముఖ్యంగా హీరోయిన్ కుటుంబసభ్యులు వీరి పేమను వ్యతిరేకిస్తారన్నారు.అలాంటి పరిస్థితిలో హీరోయిన్ హత్యకు గురవుతుందని చెప్పారు. ఆమె హత్యకు కారకులైన వారిపై హీరో ఎలా ప్రతీకారం తీసుకున్నారన్నదే కలైవేందన్ చిత్రం అన్నారు. శ్రీకాంత్‌దేవా సంగీతం చిత్రానికి పెద్ద అసెట్ అవుతుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.