నరసాపురంలో ఉద్రిక్తత | jana chaitanya yatra in narsapur | Sakshi
Sakshi News home page

నరసాపురంలో ఉద్రిక్తత

Nov 29 2016 4:37 PM | Updated on Sep 4 2017 9:27 PM

నరసాపురంలో ఉద్రిక్తత

నరసాపురంలో ఉద్రిక్తత

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం జొన్నలగరువు, కంసాల బేతపూడి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం జొన్నలగరువు, కంసాల బేతపూడి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనచైతన్య యాత్ర సందర్భంగా మంగళవారం ఆయా గ్రామాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యే బండారు మాధవనాయుడును రావద్దని గ్రామస్థులు చెప్పిన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఆక్వాపార్క్ నిర్మాణం విషయంలో తమకు అండగా నిలబడకపోవటంతో గ్రామాలకు రావద్దని ఎమ్మెల్యే బండారుకు గ్రామ పెద్దలు సూచించారు. ఆయన వస్తే అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు రోడ్లపై సిద్దంగా ఉన్నారు. జనచైతన్య యాత్రను అడ్డుకుంటే అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే మాధవనాయుడు గ్రామాల్లో పర్యటించేందుకు కొద్దిసేపట్లో రానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement