చావబోయి.. చంపాడు | husband suicide attempt leads other wome dies in chennai | Sakshi
Sakshi News home page

చావబోయి.. చంపాడు

Aug 31 2016 5:28 PM | Updated on Sep 4 2017 11:44 AM

చావబోయి.. చంపాడు

చావబోయి.. చంపాడు

దంపతుల మధ్య జరిగిన భర్త ఆత్మహత్యాయత్నం చేసేందుకు కారణమైంది.

కేకే.నగర్‌(చెన్నై): దంపతుల మధ్య జరిగిన భర్త ఆత్మహత్యాయత్నం చేసేందుకు కారణమైంది. పై అంత స్థు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకునే క్రమం లో కింద ఉన్న వృద్ధురాలిపై ఆ వ్యక్తి పడడంతో ఆమె మృతి చెందింది. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై, అశోక్‌నగర్‌ నల్లికుప్పం స్లమ్‌ క్లియరెన్స్‌ కు చెందిన సెల్వం (35) ఆటోడ్రైవర్‌. సోమవారం రాత్రి సెల్వంకు, భార్యకు మధ్య గొడవ జరిగింది.

విరక్తి చెందిన సెల్వం తాము ఉంటున్న హౌసింగ్‌బోర్డు నాల్గో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఆ సమయంలో అంతస్తు కింద నిల్చుని ఉన్న శారద (76)పై పడ్డాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిద్దర్నీ వెంటనే 108లో రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. పరీక్షించిన వైద్యులు శారద అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement