భారీగా తరలివస్తున్న భవానీదీక్షా పరులతో ఇంద్రకీలాద్రి ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంది.
భారీగా తరలివస్తున్న భవానీదీక్షా పరులతో ఇంద్రకీలాద్రి ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంది. దసరా ఉత్సవాలు ముగియటంతో అమ్మ వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో దీక్షాపరులు వస్తున్నారు. విజయదశమి మంగళవారం రావటంతో బుధవారం భవానీలు దీక్షలు విరమిస్తున్నారు. కృష్ణవేణి ఘాట్ వద్ద వీరికోసం ప్రత్యేక హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. వినాయకుని ఆలయం వద్ద నుంచి క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. హోమగుండం వద్ద కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉంది.