సుదీప్‌ హర్ట్‌ చేశాడు..హీరో ఆవేదన! | Hero Darshan ends his friendship with Sudeep | Sakshi
Sakshi News home page

సుదీప్‌ హర్ట్‌ చేశాడు..హీరో ఆవేదన!

Mar 7 2017 2:21 PM | Updated on Sep 5 2017 5:27 AM

సుదీప్‌ హర్ట్‌ చేశాడు..హీరో ఆవేదన!

సుదీప్‌ హర్ట్‌ చేశాడు..హీరో ఆవేదన!

హీరో సుదీప్‌తో ఇకపై స్నేహం ఉండదంటూ చేసిన ట్వీట్లపై హీరో దర్శన్‌ స్వయంగా స్పందించారు. ఎవరో తన ట్విట్టర్‌ఖాతాను హ్యాక్‌ చేసి చేసిన ట్వీట్లు కాదని, తానే స్వయంగా చేసినవని స్పష్టం చేశారు.

హీరో సుదీప్‌తో ఇకపై స్నేహం ఉండదంటూ చేసిన ట్వీట్లపై హీరో దర్శన్‌ స్వయంగా స్పందించారు. ఎవరో తన ట్విట్టర్‌ఖాతాను హ్యాక్‌ చేసి చేసిన ట్వీట్లు కాదని, తానే స్వయంగా చేసినవని స్పష్టం చేశారు. తనకు సినీ పరిశ్రమలో అవకాశాలు రావడానికి తానే కారణమని సుదీప్‌ చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు. దీనిపై తానేమీ స్పందించబోనని కిచ్చ సుదీప్‌ నిన్న ఇక్కడ వ్యాఖ్యానించారు.

సినిమాలో తెరపై సంభవించే మలుపులు ప్రేక్షకులను సస్పెన్స్‌కు గురిచేస్తాయి. అదే నిజజీవితంలో జరిగితే ఆ ఉత్కంఠ చెప్పలేనిది. ప్రముఖ శాండల్‌వుడ్‌ హీరో దర్శన్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో సహ నటుడు కిచ్చా సుదీప్‌తో దోస్తీ కట్‌ అన్నాడు. సుదీప్‌తో ఇకపై తనకు ఎలాంటి సంబంధాలు కొనసాగవని, కేవలం కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటులుగా మాత్రమే ఉంటామనేది ఈ వ్యాఖ్యల సారాంశం. ఆదివారం సాయంత్రం దర్శన్‌ ట్విటర్‌ అకౌంట్‌లో ఈ వ్యాఖ్యలు ప్రత్యక్ష్యమయ్యాయి.

దర్శన్‌ ట్వీట్‌లో ఏముందంటే...

దర్శన్‌ ఏమని ట్వీట్‌ చేశారంటే  ‘ఇకపై నేను, సుదీప్‌ స్నేహితులం కాదు, మేమిద్దరం కేవలం కన్నడ చిత్ర పరిశ్రమలోని నటులు మాత్రమే. ఇందులో మరే ఊహాగానాలకు తావులేదు. ఇది ఇక్కడితో ముగిసే విషయం’ అని కుండబద్ధలు కొట్టారు. కాగా, ఈ వ్యాఖ్యలు దర్శన్‌ చేశారా లేదంటే ఆయన అకౌంట్‌ను ఎవరైనా హ్యాక్‌ చేశారా అన్న విషయంపై శాండల్‌వుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితికి దారితీసిన ఘటన ఏమిటి? ఈ విషయం పై నటుడు కిచ్చా సుదీప్‌ ఏ విధంగా స్పందిస్తారనే అంశంపై కన్నడ సినీపరిశ్రమతో పాటు ఇద్దరు నటుల అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయోమయం

పోటీ తీవ్రంగా ఉండే సినీ పరిశ్రమలో ఈ ఇద్దరు హీరోలు మంచి స్నేహితులుగా తెలుసు. అనేక కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే కనిపించేవారు. అంతలోనే స్నేహబంధం బీటలు వారిందా, దీనికి కారణాలేమిటనేది సినీ వర్గాలను ఉత్కంఠకు గురిచేస్తోంది. దీనిపై ఇద్దరూ కూడా పబ్లిగ్గా స్పందించలేదు. తాజా వ్యవహారంతో ఇరువురు హీరోల అభిమానుల్లోనూ అయోమయం నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement