‘హ్యాపీ న్యూ ఇయర్’ నా డ్రీమ్ ప్రాజెక్ట్ | 'Happy New Year' My Dream Project : Farah Khan | Sakshi
Sakshi News home page

‘హ్యాపీ న్యూ ఇయర్’ నా డ్రీమ్ ప్రాజెక్ట్

Aug 7 2014 12:03 AM | Updated on Sep 2 2017 11:28 AM

‘హ్యాపీ న్యూ ఇయర్’ నా డ్రీమ్ ప్రాజెక్ట్

‘హ్యాపీ న్యూ ఇయర్’ నా డ్రీమ్ ప్రాజెక్ట్

హ్యాపీ న్యూ ఇయర్ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు అని దర్శకురాలు ఫరాఖాన్ అన్నారు. షారుఖ్‌ఖాన్, దీపికా పదుకొనె, అభిషేక్ బచ్చన్, సోనూ సూద్, బొమన్ ఇరానీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న

 హ్యాపీ న్యూ ఇయర్ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు అని దర్శకురాలు ఫరాఖాన్ అన్నారు. షారుఖ్‌ఖాన్, దీపికా పదుకొనె, అభిషేక్ బచ్చన్, సోనూ సూద్, బొమన్ ఇరానీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ ట్రైలర్‌ను ఈ నెల 14న విడుదల విడుదల చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందే సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బుధవారం ప్రకటించింది. నగరంలోని సహారా స్టార్ హోటల్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో చిత్రా తారాగణంతోపాటు దర్శకురాలు ఫరాఖాన్, సంగీత దర్శక ద్వయం విశాల్-శేఖర్‌లు కూడా పాల్గొననున్నారు.
 
 సినిమాలో అంతర్లీనంగా భారతీయతాభావం ఉన్నందున స్వాతంత్య్రోత్సవాలకు ఒకరోజు ముందు ట్రైలర్స్‌ను విడుదల చేస్తున్నట్లు రెడ్ చిల్లీస్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉంటాయని తెలిపింది. సినిమా సక్సెస్ కోసం చేసే డిజిటల్ ప్రచారం కూడా భిన్నంగా ఉండబోతోందని ప్రకటించింది. ఈ ఆలోచన అంతా దర్శకురాలు ఫరాఖాన్‌దేనని తెలిపింది. ఈ విషయమై ఫరాఖాన్ మాట్లాడుతూ... ‘హ్యాపీ న్యూ ఇయర్... నా కలల ప్రాజెక్టు. చాలా రోజుల నుంచి ఈ సినిమా కోసం కష్టపడుతున్నాను.
 
 సినిమా ఫస్ట్‌లుక్ విడుదలవుతుందంటేనే నాకెంతో థ్రిల్లిం గ్‌గా ఉంది. ఈ సినిమా కోసం షారుఖ్, నేను దాదాపు ఏడేళ్లు కష్టపడ్డాం. ట్రైలర్స్‌తోనే సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. సినిమా కూడా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఈ ట్రైలర్స్‌ను కేవలం మీడియా ప్రతి నిధుల కోసమే కాదు.. కొంతమంది అభిమానులకు కూడా అవకాశం ఇచ్చాం. వారంతా మాతోపాటు లంచ్‌లో పాల్గొం టారు. సినిమాలో అన్నిరకాల వాణిజ్య అంశాలతోపాటు విమర్శకులుసైతం మెచ్చుకునే అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయ’ని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement