
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఇండియన్ హజ్ హౌజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబుబాకర్ కలిశారు. చెన్నైలో వీరి సమావేశం జరిగింది. భేటీ సందర్భంగా రజనీకాంత్‌ను శాలువాతో అబు బాకర్ సత్కరించారు. రజనీని మర్యాదపూర్వకంగానే కలిసినట్లుగా సమావేశం అనంతరం ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో, దేశంలో చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిణామాలపై చర్చించినట్లుగా తెలిపారు.