మానవహక్కుల సంఘం పేరిట వసూళ్లు


- నలుగురు అరెస్ట్

సుల్తానాబాద్: మానవహక్కుల సంఘం పేరిట ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లోని పలు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలను గత కొన్ని రోజులుగా ఓ ముఠా మానవ హక్కుల సంఘం పేరిట వేధింపులకు గురిచేస్తూ.. అక్రమంగా చందాలు వసూలు చేస్తోంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నలుగురు వ్యక్తుల ముఠాను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ విజయేందర్ రెడ్డి వివరాలు తెలిపారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top