రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి


 సాక్షి, ముంబై: అమరావతి నుంచి బుల్డాణా దిశగా వెళ్తున్న ఎంఎస్‌ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి ప్రమాదానికి గురవడంతో నలుగురు దుర్మరణం పాల య్యారు. అకోలా సమీపంలోని మర్జితాపూర్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కంటెయినర్ లారీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 24 మందికి తీవ్ర గాయాలవడంతో అకోలాలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురి వివరాలు మాత్రమే తెలిశాయి. వారిని కిరణ్ భురసాకలే (53), రవీంద్ర తావ్డే (52), వీర్ బేండ్వాల్‌గా గుర్తించారు. ఇంకొకరి గురించి తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎంఎస్‌ఆర్టీసీ ఆర్థికసాయం అందజేయనుంది. మృతుల కుటుంబానికి రూ.ఐదు వేలు, గాయపడిన వారికి రూ.500 చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది.  

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top