నలుగురు ఖైదీల పరారీ | Four inmates escape | Sakshi
Sakshi News home page

నలుగురు ఖైదీల పరారీ

Mar 24 2016 2:17 AM | Updated on Sep 3 2017 8:24 PM

నలుగురు   ఖైదీల పరారీ

నలుగురు ఖైదీల పరారీ

కలబురగి నగర శివార్లలోని కేంద్ర కారాగారం నుంచి నలుగురు విచారణ ఖైదీలు పరారయ్యారు.

కలబురగి జైలులో ఘటన


హుబ్బళ్లి :  కలబురగి నగర శివార్లలోని కేంద్ర కారాగారం నుంచి నలుగురు విచారణ ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటన బుధవారం  తెల్లవారు జామున చోటు చేసుకుంది. హత్య ఆరోపణలతో అరెస్ట్ అయిన శివకుమార్, పోస్కో చట్టం కింద  అరెస్ట్ అయిన సునీల్ కుమార్, నాగేంద్రప్ప, తాజుద్దీన్, లక్ష్మణలు ఒకే బ్యారక్ ఉంటున్నారు. నిందితులు పథకం ప్రకారం ఇనుప రాడ్లు విరగ్గొట్టి గోడపై విద్యుత్ ప్రసారం కోసం ఏర్పాటు చేసిన తీగల కింద రాళ్లను తొలగించి ఆ సందులోంచి పరారయ్యారు.
 

ఈశాన్య రేంజ్ పోలీసు ఐజీ బీ.శివకుమార్, కలబురగి ఎస్పీ అమిత్‌సింగ్, రూరల్ డీఎస్పీ విజయ్ అంచి, ఫర్హతాబాద్ పోలీసు స్టేషన్ ఏఎస్పీ  జైలు వద్దకు చేరుకుని వివరాలు ఆరా తీశారు. అనంతరం కేంద్ర బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో నిందితుల కోసం గాలింపు చేపట్టారు.  పోలీసు   జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్లను, చెక్‌పోస్ట్‌లను అప్రమత్తం చేసి నిఘా పటిష్టం చేశారు. తప్పించుకున్న విచారణ ఖైదీలను సత్వరం పట్టుకుంటామని ఈశాన్య రేంజ్ ఐజీ శివకుమార్ మీడియాకు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement