బస్సును ఢీకొన్న లారీ: నలుగురికి గాయాలు | four injured in road accident in piduguralla | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న లారీ: నలుగురికి గాయాలు

Oct 12 2016 7:39 AM | Updated on Aug 30 2018 4:10 PM

పిడుగురాళ్ల శివారులో ఆర్టీసీ బస్సును బుధవారం తెల్లవారుజామున లారీ ఢీకొట్టింది.

గుంటూరు : పిడుగురాళ్ల శివారులో ఆర్టీసీ బస్సును బుధవారం తెల్లవారుజామున లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

కేసు మీరే రాసుకోవాలంటూ బస్సు ప్రయాణికులపై హల్చల్ చేశారు. బస్సుతోపాటు ప్రయాణికులకు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. దాదాపు నాలుగు గంటల పాటు ప్రయాణికులు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. పోలీసుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement