గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్‌లకు జలకళ వచ్చింది.
లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత
Sep 26 2016 1:08 PM | Updated on Sep 4 2017 3:05 PM
కరీంనగర్: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్‌లకు జలకళ వచ్చింది. జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. సోమవారం ఉదయం డ్యామ్‌ను సందర్శించిన మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లు వరద పరిస్థితిని సమీక్షించి డ్యామ్ 6 గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 21 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ఇన్ఫ్లో 40 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 14 వేల క్యూసెక్కులుగా ఉంది.
Advertisement
Advertisement