శ్రీపాదఎల్లంపల్లికి వరద పోటు | flood to Sripada ellampalli | Sakshi
Sakshi News home page

శ్రీపాదఎల్లంపల్లికి వరద పోటు

Sep 27 2016 10:15 AM | Updated on Aug 1 2018 3:59 PM

జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది.

జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ నుంచి 5,27,662 క్యూసెక్కుల నీరు వస్తుండగా అదే స్థాయిలో 40 గేట్లు ఎత్తి దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు. లోయర్ మిడ్‌మానేరు డ్యామ్‌కు వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం 7 గంటల వరకూ డ్యామ్‌లో నీటి మట్టం 21.87 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 18167 క్యూసెక్కులు ఉండగా 5000 క్యూసెక్కులు కాకతీయ కాలువకు వదులుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement